Gossipsజై సింహా కథ లీక్.. ట్రైలర్ కాదు అసలు సినిమా అదుర్స్..!

జై సింహా కథ లీక్.. ట్రైలర్ కాదు అసలు సినిమా అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న జై సింహా ఈ సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఈ సినిమా కథ ఇదే అంటూ మీడియాలో ఓ కథ లీక్ అయ్యింది. నయనతార ప్రేమను కోల్పోయిన బాలయ్య అపాయంలో ఉన్న హరిప్రియను కాపాడటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడని ఇదే జై సింహా కథ అని అన్నారు. అయితే ఇప్పుడు జై సిం హా అసలు కథ సూపర్ స్టార్ రజినికాంత్ ముత్తు సినిమా కథను పోలి ఉంటుందని అంటున్నారు.

రజిని కె.ఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన ముత్తు సినిమా సెంటిమెంట్ మూవీ. అయితే జై సింహా మూవీ ట్రైలర్ లో ఇదో మాస్ సినిమాగా కనిపిస్తుంది. అయితే మాస్ ఆడియెన్స్ కోసం ట్రైలర్ అలా కట్ చేశారని సినిమా కథ మాత్రం ముత్తు సినిమాకు దగ్గరగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి కె.ఎస్ రవికుమార్ ఎన్.బి.కె కాంబోలో వస్తున్న ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు నందమూరి ఫ్యాన్స్.

చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. నయనతార, హరిప్రియలతో పాటుగా నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news