Gossipsబాలయ్యను భయపెడుతున్న సూర్యా'గ్యాంగ్'

బాలయ్యను భయపెడుతున్న సూర్యా’గ్యాంగ్’

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్‌లోమంచి పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న విడుదలకు సిద్ధంకాగా.. బాలయ్య , నయనతార జంటగా వస్తోన్న ‘జై సింహా’ జనవరి 12 తేదీని రిలీజ్ కాబోతుండగా… అదే రోజు సూర్య నటించిన ‘గ్యాంగ్’ విడుదల కానుండటంతో బాలయ్య -సూర్య పోటీపడే అవకాశం కనిపిస్తోంది

బాలయ్య సినిమా రోజునే ఈ భారీ డబ్బింగ్ సినిమా విడుదల కావడం టాలీవుడ్ లో కొత్త చర్చకు దారి తీసింది. సంక్రాంతి సీజన్ అంటేనే టాప్ హీరోల సినిమాల మధ్య భారీగా పోటీ ఉంటుంది. ఆ ఆసమయంలో తమిళ డబ్బింగ్ సినిమాలు అస్సలు పోటీ పడవు. కానీ సూర్య తాజా సినిమా ‘తానా సేంద్ర కూట్టం’ ను తెలుగులో ‘గ్యాంగ్’ అన్న పేరుతో తెలుగు తమిళ భాషలలో ఒకేరోజు జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ‘జై సింహా’ కు ‘అజ్ఞాతవాసి’ తో తీవ్రపోటీ ఏర్పడిన నేపధ్యంలో ఇప్పుడు ‘గ్యాంగ్’ కూడ రంగంలోకి దిగడంతో బాలకృష్ణ సినిమాకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. కె.ఎస్.రవికుమార్ లాంటి టాప్ డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ‘జై సింహా’ సినిమాపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా జై సింహా సినిమాకు ఇప్పటికే సరైన మార్కెట్ కూడా లేదు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు బాలకృష్ణ పవన్ సూర్యాల మధ్య చిక్కుకోవడం నందమూరి అభిమానులను కలవరపెడుతోంది.

‘గ్యాంగ్’ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ చబ్బీస్’కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికి అదనంగా ఈమూవీలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్ రమ్యకృష్ణలు ‘గ్యాంగ్’ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇదే ఇప్పుడు బాలయ్యను కూడా కలవరపెడుతోంది.

రమ్యకృష్ణ హీరో సూర్యతో కలిసి ఈ సినిమాలో లుంగీ డాన్స్ చేసిన సన్నివేశాలను ఈ మూవీ టీజర్ లో విడుదల చేసినప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది. దీనికితోడు ఈసినిమాను అల్లుఅరవింద్ తెలుగులో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈడబ్బింగ్ సినిమాకు తెలుగు సినిమాగా ప్రేక్షకులలో అభిప్రాయం ఏర్పడితే పవన్ సూర్యల మధ్య బాలకృష్ణకు కష్టాలు తప్పవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news