Gossips‘జై లవ కుశ’ ఓవర్సీస్ రైట్స్‌కి కళ్యాణ్‌రామ్ భారీ డిమాండ్!!

‘జై లవ కుశ’ ఓవర్సీస్ రైట్స్‌కి కళ్యాణ్‌రామ్ భారీ డిమాండ్!!

ప్రస్తుత జనరేషన్‌లో ఎక్కువ సక్సెస్ రేట్ కలిగివున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. ఇతను చేసిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ని ఓ రేంజులో కుమ్మేసి.. ఇండస్ట్రీలో తారక్‌ మార్కెట్‌ని అమాంతం పెంచేశాయి. దాంతో.. అతని తాజా చిత్రం ‘జై లవ కుశ’కి మంచి డిమాండే ఏర్పడింది. భారీ రేట్లకి దీని రైట్స్ సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. ఇదే మంచి సమయమని భావించినా నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా.. భారీ అమౌంట్‌నే కౌంట్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల బయ్యర్లు అతను అడిగేంత డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు కానీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం.. కళ్యాణ్ ఊహించని రేటు కోట్ చేయడమే.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ డిస్ట్రిబ్యూటర్ ‘జై లవ కుశ’ ఓవర్సీస్ రైట్స్ కోసం సంప్రదిస్తే, కళ్యాణ్ ఏకంగా రూ.14 కోట్లు కోట్ చేశాడట. ఆ ఫిగర్ చూసి ఖంగుతిన్న సదరు పంపిణీదారుడు.. బ్యాక్‌స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ ప్రకారం చూస్తే అది చాలా పెద్ద మొత్తం. అంత అమౌంట్ రికవర్ చేయాలంటే.. కచ్ఛితంగా 3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి వస్తుంది. అయితే.. తారక్‌కి అక్కడ అంత మార్కెట్ లేదు. అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘జనతా గ్యారేజ్’ సినిమానే ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోలేకపోయింది. అంతకుముందు ‘నాన్నకు ప్రేమతో’ మూవీ 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది కానీ.. అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రెడిట్ కూడా వుంది. పైగా.. ఆ చిత్రం ఓవర్సీస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్‌తో తెరకెక్కడంతో, అక్కడివారు దానికి బ్రహ్మరథం పట్టారు. ఏదేమైనా.. తారక్‌కి ఓవర్సీస్‌లో 2.2 మిలియన్ మార్కే హయ్యెస్ట్ ఫిగర్.

అలాంటిది.. ‘జై లవ కుశ’కి ఏకంగా రూ.14 కోట్ చేయడంతో బయ్యర్స్ కాస్త జంకుతున్నారు. అమౌంట్ కాస్త తగ్గించుకోమని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కళ్యాణ్ మాత్రం ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేక, సైలెంట్‌గానే వున్నాడట. ఓవర్సీస్ రూపంలో భారీగానే రాబట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ కుదరని పక్షాన.. కాస్త తగ్గించాలని అనుకుంటున్నాడట. చివరికి ఈ డీల్ ఎంతకు ఫిక్స్ అవుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news