Moviesనెంబర్ వన్ ప్లేస్ లో 'జై'... చాలా ఫాస్ట్ గా కొట్టేశాడు.....

నెంబర్ వన్ ప్లేస్ లో ‘జై’… చాలా ఫాస్ట్ గా కొట్టేశాడు.. ధైర్యం ఉందా..?

జులై 6 న జై లవకుశ లోని జై పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘జై’ టీజర్ తన రికార్డుల పరంపరని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్థానం లో, దక్షిణ భారతదేశం లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ సినిమా టీజర్ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. ఏ విషయంలో అని అనుకుంటున్నారా ? చాలా ఫాస్ట్ గా 15 మిలియన్ల వ్యూస్ ని అతి తక్కువ రోజుల్లో దాటేశాడు మన ‘జై’. అంతే కాదండోయి 263 వేల లైక్స్ కూడా సాధించి నెంబర్ వన్ స్థానాన్ని అలా గర్వంగా తల ఎత్తుకొని అలంకరించాడు. ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచుకున్న జై లవకుశ సినిమా, ఈ టీజర్ తో అయితే అంచనాలను ఆకాశానికి పెంచుకున్నది. అంతేకాదు ఈ మధ్య రిలీజ్ అయిన లవ ఫస్ట్ లుక్ కూడా పలువురు ప్రశంసలను అందుకుంది. ఇంత ఫాస్ట్ గా 15 మిలియన్ల వ్యూస్ ని సాధించే ధైర్యం ఉందా??

జై లవకుశ సినిమా యూనిట్, రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ మధ్యనే హైదరాబాద్ చేరుకొంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జతగా నివేతా , రాశి ఖన్నాలు నటిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 21 న రిలీజ్ చేసేందుకు అన్ని డిపార్టుమెంట్లు రాత్రి పగలు కష్టపడుతున్నట్లు వినికిడి. ఇంకా లవ టీజర్ , కుశ ఫస్ట్ లుక్ ,కుశ టీజర్ మరియు జై లవకుశ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య సినీ అభిమానులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news