Gossipsజై లవ కుశ లో కేక లు పెట్టించే ఐటం...

జై లవ కుశ లో కేక లు పెట్టించే ఐటం సాంగ్ రెడీ.. హీరోయిన్ ఎవరో తెలుసా!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు నటిస్తున్నాడని తెలిసిందే. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కూడా ఉండబోతుందట.

లాస్ట్ ఇయర్ వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. కాజల్ కెరియర్ లో మొదటిసారి ఐటంగా అదరగొట్టిన ఆ సాంగ్ సినిమాను మరింత హుశారెత్తేలా చేసింది. ఇక అదే ఫార్ములాతో జై లవకుశలో కూడా ఓ క్రేజీ హీరోయిన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.

తెలుస్తున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ జై లవ కుశలో ఐటం గాళ్ గా కనిపించబోతుందట. నాన్నకు ప్రేమతోలో ఎన్.టి.ఆర్ పక్కన నటించిన రకుల్ ఐటం సాంగ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ఈ ఐటం సాంగ్ కోసం భారీగానే వసూళు చేస్తుందట. మరి కాజల్ తో పక్కా లోకల్ అని కేక పెట్టించిన తారక్ రకుల్ తో ఎలాంటి ఐటంతో వస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news