Gossipsఅమ్మతోడు ఏ ఒక్క రికార్డ్ మిగల్లే.. జై లవ కుశ ట్రైలర్...

అమ్మతోడు ఏ ఒక్క రికార్డ్ మిగల్లే.. జై లవ కుశ ట్రైలర్ అరాచకం ఇది..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ నెల 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ అయిన 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ 7.54 మిలియన్ వ్యూయర్స్ సాధించింది.

ఇదవరకు ఏ సినిమా సృష్టించని విధంగా ఒక్క రోజులో 7.54 మిలియన్ వ్యూయర్స్ సాధించడం విశేషం. ఇక ఇలాంటి రికార్డ్ ఏ సినిమాకు లేదని చెప్పాలి. ఇక లైకుల విషయంలో కూడా 174 వేల లైక్స్  సాధించింది. ఈ లెక్కతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు తారక్. జై లవ కుస ట్రైలర్ అరాచకం చూస్తుంటే ఇక సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తుంది.

ఇప్పటిదాకా కాటమరాయుడు ట్రైలర్ కు ఉన్న 156 వేల లైకుల రికార్డ్ జై లవ కుశ సినిమా ట్రైలర్ బీట్ చేసింది. యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డ్ ప్రస్తుతం తారక్ పేరు మాదే ఉంది. నాన్ బాహుబలి రికార్డుల లెక్కలో ఎన్.టి.ఆర్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news