Gossipsజై లవ కుశ ట్రైలర్.. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం..!

జై లవ కుశ ట్రైలర్.. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం..!

సింగిల్ క్యారక్టర్ తోనే సంచలనాలు సృష్టించిన చరిత్ర కలిగిన తారక్ మూడు పాత్రలు ఒకే సినిమాలో చేస్తే.. ఎబ్బే ఇక చెప్పుకోడానికి ఇక రికార్డులు ఏమైనా మిగులుతాయా చెప్పండి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఇక ఈ వేడుకలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జై పాత్రలోని ఆహార్యం.. లవ పాత్రలోని అమాయకత్వం.. లవ పాత్రలోని చిలిపితనం ఇలా మూడు సరికొత్త పాత్రల్లో తారక్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సినిమా తప్పకుండా అభిమానుల అంచనాలను మించి ఉంటుందని తారక్ చెప్పాడు. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రాం నిర్మించడం జరిగింది.

దసరా బరిలో దిగుతున్న జై లవ కుశ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో కాని రిలీజ్ ముందు ఆ హంగామా మాత్రం పదిరోజుల ముందే పండుగ వచ్చేసినట్టు కనిపిస్తుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news