Newsఆది, అభిల అసలు స్వరూపం ఇది : జబర్దస్త్ ఫణి

ఆది, అభిల అసలు స్వరూపం ఇది : జబర్దస్త్ ఫణి

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంస్ లో జబర్దస్త్ కు మొదటి ప్లేస్ అని చెప్పడంలో సందేహం లేదు. కామెడీతో కడుపుబ్బా నవ్వించేలా చేస్తున్న ఈ షో తెలుగు ప్రేక్షకులందరికి ఓ మంచి నేస్తంగా మారింది. గురు, శుక్రవారాలు వస్తే ఆ ప్రోగ్రాం ఎక్కడ మిస్ అవుతామో అన్న ఆలోచన వస్తుంది. ఇక ఈ షోలో అంతర్గత గొడవల గురించి అప్పుడప్పుడు వార్తలు బయటకు వస్తాయి.

ఈ క్రమంలో జబర్దస్త్ గురించి తన మనసులోని మాట చెప్పాడు ఫణి. జబర్దస్త్ లో అభి టీంలో పనిచేసి.. ఆ తర్వాత రాకేష్ టీంలో కూడా కామెడీ పంచాడు ఫణి. ఇండస్ట్రీకి 17 ఏళ్ల క్రితం వచ్చిన ఫణి జబర్దస్త్ తనకు ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చిందని అన్నాడు. ఇక ఆది, అభిల గురించి బయట వినిపిస్తున్న కామెంట్లు తప్పుబట్టాడు.

ఆదికి అభి ఛాన్స్ ఇచ్చిన మాట నిజమే.. అయితే ఆదిలో మంచి టాలెంట్ ఉందని అందుకే అతను సక్సెస్ అయ్యాడని అన్నాడు. ఇక ఆది వల్ల తను జబర్దస్త్ వదలాల్సి వచ్చింది అనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని అన్నాడు ఫణి. తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని.. జబర్దస్త్ వదలడానికి ఆది, అభి కారణం కాదని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news