Newsహైదరాబాద్‌లో దారుణమైన వ్యభిచారం గుట్టు రట్టు చేసిన బాలిక

హైదరాబాద్‌లో దారుణమైన వ్యభిచారం గుట్టు రట్టు చేసిన బాలిక

A couple arrested for alegedly running a brothel house with minor girls in Hyderabad.

హైదరాబాద్‌లో వ్యభిచారం గుట్టుగా నడిపే ముఠాలు కోకొల్లలు. వీరిలో ఓ ముఠా పేద కుటుంబాల్లో పుట్టిన బాలికలను టార్గెట్ చేస్తూ.. ఉద్యోగం పేరిట వారిని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. పాతబస్తీకి చెందిన ఓ భార్యాభర్తల జంట ఈ వ్యవహారాన్ని కొన్నాళ్ల నుంచి రహస్యంగా నడుపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వారు ఓ పేద బాలికకు పని ఇప్పిస్తామని చెప్పి.. ఆమెతో పడుపు వృత్తి చేయించాడు. రెండు నెలలపాటు నరకం చవిచూపిన ఆ యువతి… చివరికి తెలివిగా వ్యవహరించి వారి చెరనుంచి తప్పించుకుంది. వారిని పోలీసులకు అడ్డంగా పట్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌజ్‌కు చెందిన షాహీన్‌, ముక్తార్‌ దంపతులు రెండు నెలల క్రితం పాతబస్తీకు చెందిన 15 ఏళ్ల బాలికను పని కల్పిస్తామంటూ తమ వెంట తీసుకెళ్ళారు. గోల్కొండ సమీపంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంలోకి ఆమెని చేర్పించారు. తనను వదిలేయమని ఆ బాలిక ఎంతగా ప్రాధేయపడినా.. ఆ దంపతులు వినలేదు. ఆమెని ఓ గదిలో బంధించేశారు. టాబ్లెట్స్‌, మత్తు పదార్థాలను ఇచ్చి మత్తులోకి పంపించేవారు. ఆమె మత్తులో ఉన్నప్పుడు.. విటులను లోనికి పంపేవారు. అక్కడి నుంచి బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. ఫలితం లేకపోయింది.

మరోవైపు.. బాలిక త‌ల్లిదండ్రుల‌కు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ భార్యాభర్తలిద్దరూ వారికి ప్ర‌తి నెలా కొంత‌మొత్తం పంపుతూ ఉండేవారు. ఇలా రెండు నెలలు గడిచిపోయింది. ఓరోజు బాలికకి అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లభించింది. అప్పుడు ఏమాత్రం ఆమె తొందరపడలేదు. చాలా తెలివిగా వ్యవహరించి.. తన బంధువు సాయంతో బయటపడింది. అలా తప్పించుకున్న ఆ బాలిక.. గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ భార్య‌భ‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. వ్య‌భిచార గృహంపై కూడా దాడి చేసి.. మ‌రికొంత మందికి విడిపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news