బంపరాఫర్లకే అమ్మమొగుడు.. జనాలతో కిక్కిరిసిన హైదరాబాద్ సెంట్రల్ మాల్

hyderabad central mall bumper offer

Huge crowd at Hyderabad central mall because that introduces a bumper offere which attracted everyone.

సాధారణంగానే షాపింగ్ అంటే ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. వీకెండ్ వస్తే చాలు.. ప్రతిఒక్కరూ మాల్స్‌లోనే తిష్టవేస్తారు. ఇక ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే మాత్రం.. అక్కడ జనాల శాతం రెండు నుంచి మూడింతలు పెరిగిపోతుంది. అలాంటిది.. బంపరాఫర్‌లకే అమ్మమొగుడైన డిస్కౌంట్‌ని ప్రకటిస్తే.. అంతే సంగతులు. బెల్లంకి చీమలు చుట్టుముట్టినట్లుగా ఆ మాల్‌లో జనాలు కిక్కిరిసిపోతారు. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్ సెంట్రల్ మాల్‌లో కనిపించింది. గతంలో మునుపెన్నడూలేని ఆఫర్‌ని ఆ మాల్ ప్రకటించడంతో.. అక్కడ జనాలు పోటెత్తడం జరిగింది.

ఇంతకీ ఆ మాల్ ప్రకటించిన ఆ ఆఫర్ ఏంటంటే.. రూ.8 వేలు మేర షాపింగ్ చేస్తే రూ.4 వేలు మాత్రమే బిల్లు వేస్తారు. అంటే.. 50 శాతం డిస్కౌంట్ అన్నమాట. అంతేకాదు.. దాంతోపాటు మరెన్నో అవకాశాలు కూడా కల్పించింది. కూపన్లతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఆ మాల్ ప్రకటించింది. ఇంతకంటే భారీ ఆఫర్ ఇంకేముంటుంది. అందుకే.. జనాలందరూ సెంట్రల్ మాల్ చుట్టూ తిరుగుతున్నారు. అసలక్కడ జనాలు ఏ స్థాయిలో ఉన్నారంటే.. పంజాగుట్ట సర్కిల్ కూడా బ్లాక్ అయిపోయింది. ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో.. పోలీసులు అక్కడి పరిస్థితుల్ని అదుపు చేయడానికి పోలీసులు పడ్డ నానాతంటాలు అంతాఇంతా కాదు.

మొన్నటికి మొన్న బ్రాండ్ ఫ్యాక్టరీ కూడా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించగా.. దాని బ్రాంచీల్లో జనాలు ఓ రేంజులో ఎగబడ్డారు. ఇప్పుడు జనాల్ని తనవైపు తిప్పుకోవడం కోసం హైదరాబాద్ సెంట్రల్ మాల్ ఆ ఆఫర్‌నే వాడుకుంది.

More from my site