Gossipsపవన్ , మహేష్ లు అంత కాస్ట్లీనా..?

పవన్ , మహేష్ లు అంత కాస్ట్లీనా..?

సినిమా హీరోల మీద ఫ్యాన్స్ కి మీద ఉండే అభిమానమే వేరుసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అని తెలిసినా అభిమానులు అవేమి పట్టించుకోరు.వారికి కావాల్సింది హీరో చూపించే హీరోయిజంఈ కారణం గానే హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది.

త్రివిక్రమ్ డైరక్షన్ లో పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి ‘ సినిమా మార్కెట్ కూడా ఇదే విధంగా ఆమాంతం పెరిగిపోయిందిఈ సినిమా ఆంధ్ర లో 50 కోట్ల రేషియోలో అమ్మేసారుపవన్ సినిమాల్లో ఇదో సరి కొత్త రికార్డు గా ఇండ్రస్ట్రీ పెద్దలు చెబుతున్నారుదీంతో పాటు మహేష్ బాబుకొరటాల శివ కాంబినేషన్ లోని భరత్ అనే నేనుఅనే సినిమా మార్కెట్ కూడా మంచి ఊపు మీద ఉంది.

మహేష్ కి ప్రస్తుతానికి సరైన హిట్టు లేకపోవడంతో ఆయన మార్కెట్ అంతంత మాత్రంగా ఉంటుందని అంతా భావించారుకానీ అదేదీ వాస్తవం కాదని నిరూపించుకున్నాడు మహేష్గతం లో ఇదే కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందికొరటాల శివ ఇప్పటి వరకు ఫ్లాప్ తీయలేదన్న భరోసా వుందిఅందుకే ఇప్పుడు ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 45కోట్ల రేషియోలో చెబుతున్నారట.

స్పైడర్ సినిమా ప్లాప్ అయ్యింది కదా అంత మార్కెట్ ఉండదని అందరూ భావించారుకానీ బయ్యర్లు ఎవరూ వెనకడుగు వేయడంలేదుకొరటాల శివ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను కోనేందుకు బయ్యర్లు పోటీలు పడుతున్నారుపెద్ద హీరోల సినిమాలన్నీ రోజు రోజుకు మార్కెట్ పెంచుకుంటూ పోతుండడం శుభపరిణామం గానే చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news