Newsఫైవ్ స్టార్ హోటల్లోనూ ఆగని అత్యాచారాలు.. హోటల్ ఉద్యోగిని పై అత్యాచార...

ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఆగని అత్యాచారాలు.. హోటల్ ఉద్యోగిని పై అత్యాచార యత్నం (వీడియో)

నిన్న కాక మొన్ననే మనమంతా ఎంతో గొప్పగా 71 వ స్వాతంత్ర దినోత్సవవేడుకలు జరుపుకున్నాం. మన దేశభక్తిని పేస్ బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా ఎంతో గొప్పగా చాటుకున్నాం. కానీ దోచేవాడు దోచుకుంటూనే ఉన్నాడు.. దోపిడీకి గురయ్యేవాడు దోపిడీకి బలి అవుతూనే ఉన్నాడు. నిర్భయ చట్టమంటూ ఎంత గొప్ప చట్టాలు తెచ్చినా, ఆడవారిపై ఆకృత్యాలు మాత్రం రోజు రోజు కి పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగడం లేదు. ఎక్కడో మారుమూల.. నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ దేశ రాజధానిలో అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో సెక్యూరిటీ మేనేజర్ తన క్రింద పనిచేసే ఉద్యోగిని పై లైంగిక వేధింపులు చేసాడంటే ఏమనుకోవాలి ?

దారుణం జరిగిన అసలు విషయానికొస్తే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గరలో గల ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లోని 33 ఏళ్ల ఉద్యోగిని పై తన పై అధికారి ఉండగానే , సెక్యూరిటీ మేనేజర్ లైంగిక వేధింపులు చేసాడు. జులై 29 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఉద్యోగిని HR డిపార్టుమెంటు కి సంఘటన జరిగిన రాత్రే కంప్లయింట్ చేసింది. కానీ అక్కడి నుండి తనకు ఏమాత్రం స్పందన లభించకపోవటంతో తన భర్త సలహాతో పోలీసులని సంప్రదించి కేసు పెట్టింది. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు ఉద్యగులని హోటల్ మేనేజ్ మెంట్ సస్పెండ్ చేసింది.కేసు పెట్టిన కారణంగా ఆమెని కూడా ఉద్యగమునుండి తొలగించడం ఇక్కడ గమనించాల్సిన మరో మలుపు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news