Healthజుట్టు మాటిమాటికీ రాలిపోతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

జుట్టు మాటిమాటికీ రాలిపోతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

Experts giving best remedies to get rid of hair loss problems.

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పైగా.. వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఈ కారణాల వల్ల కొందరికి జుట్టు మాటిమాటికీ రాలిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సెలూన్స్, స్పాలకు వెళ్ళినా.. ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, ఆ ప్రాబ్లమ్ అలాగే ఉండిపోతుంది. మరెన్నో మార్గాలు వినియోగించినప్పటికీ.. ఫలితం మాత్రం దక్కదు. ఇలాకాకుండా.. అందుబాటులో ఉండే హోమ్ రెమెడీస్‌తో ప్రయత్నిస్తే, మంచి ఫలితాలు కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు. ఆ చిట్కాల్లో రెండు మీకోసం..

1. కలబంద : ఆ రెమెడీతో మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది జుట్టులోని చుండ్రుని తగ్గించడంతోపాటు జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ కలబంద రసాన్ని జుట్టుకి అప్లై చేస్తే.. అది యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియాగా కూడా పని చేస్తుంది. ప్రతిరోజూ ఇలా దీని రసాన్ని తలకి పట్టిస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
2. కొబ్బరినూనె : దీనిని గోరువెచ్చగా చేసుకుని, తలంతా అప్లై చేస్తే.. మృతకణాలు తొలగిపోతాయి. ఆ స్థలంలో జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. అలాగే బ్లడ్‌ సర్క్యులేషన్‌ కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ఈ రెమెడీని పాటిస్తే.. జుట్టు రాలిపోయే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
3. పై రెండింటి రెమెడీలు పాటించడంతోపాటు కురుల పెరుగుదలకి క్రమం తప్పని డైట్‌ పాటించాలి. ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, చికెన్‌, కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు తినాలి. ఫలితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news