Gossipsనిఖిల్ పెళ్లి క్యాన్సిల్‌.. గుట్టుగానే పెళ్లి రద్దు వ్యవహారం!!

నిఖిల్ పెళ్లి క్యాన్సిల్‌.. గుట్టుగానే పెళ్లి రద్దు వ్యవహారం!!

హీరో నిఖిల్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తన సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అతడి తల్లితండ్రులు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కూతురు తేజశ్వినిని నిఖిల్ కు ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. తేజస్విని.. నిఖిల్‌కు దూరపు చుట్టం కూడా.. దీంతో ఇక వీరి వివాహం పక్కా అని అంతా అనుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 24న నిశ్చితార్ధం జరిపి అక్టోబర్‌లో వివాహ వేడుక నిర్వహించాలని భావించారు.కానీ ఇప్పుడు ఈ పెళ్లిని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ముందుగా బంధువులు కావడంతో వధూవరుల జాతకాలు చూపించకుండా పెళ్లి అనుకున్నారు. కానీ జాతకాల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికీ కూడా నప్పకపోవడంతో పరస్పర అంగీకారంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ఒక ఇంటి వాడవుతాడనుకున్న నిఖిల్‌కు పెళ్లి జరగడానికి కాస్త సమయం పట్టేలానే ఉంది. మొత్తానికి రీల్ లైఫ్‌లో జాతకాలు, జోతిష్యం జాన్తా నై అన్న నిఖిల్ రియల్ లైఫ్‌లో మాత్రం జాతకాలవైపే మొగ్గుచూపాడు. అక్కినేని నటవారసుడు అఖిల్ పెళ్లివరకూ వెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం అదే తరహాలో నిఖిల్ కూడా పెళ్లిని రద్దు కావడంతో పెళ్లీడుకొచ్చిన టాలీవుడ్ యంగ్ హీరోలు ఆలోచనలో పడ్డారు. అయితే నిఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం గుట్టుగానే సాగుతుంది. ఇరు కుటుంబాలకు చెందిన వారెవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news