Moviesమహానటి పై నాని సంచలన వ్యాఖ్యలు.. కీర్తి కాకుండా "ఆ హీరోయిన్"...

మహానటి పై నాని సంచలన వ్యాఖ్యలు.. కీర్తి కాకుండా “ఆ హీరోయిన్” మాత్రమే చేయగలుగుతుంది!!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటిపై ప్రశంసల జడివాన కురుస్తుంది. ప్రేక్షకాభిమానమే కాదు సిని సెలబ్రిటీస్ నుండి కూడా ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, రాజమౌళి మహానటి సినిమాను కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ ను పొగడగా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని మాత్రం ఎవరు ఊహించని విధంగా సంచలన ట్వీట్ చేశాడు.

మహానటిగా కీర్తి నటించిన తీరు చూసి కేవలం ఒకే ఒక్కరు ఈ పాత్రని నీకన్నాఒకరు మాత్రమే బెటర్ గా చేయగలరు అది కూడా సావిత్రి గారు మాత్రమే అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ సినిమా ఎంత బాగుందంటే ఎంత బాగుందో చెప్పలేనంత అన్నాడు నాని. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ ను చూసి గర్వంగా ఉందని స్వప్న, ప్రియాంకా, దుల్కర్, సమంత, విజయ్ ఎంటైర్ టీం అందరికి థ్యాంక్స్ అని చెప్పాడు నాని.

మహానటి పాత్రలో ఆ మహానటి తర్వాత కీర్తి సురేష్ మాత్రమే మెప్పించగలదు అని ప్రూవ్ చేసుకుంది. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి సురేష్ ను మహానటి మళ్లీ పుట్టింది అంటూ సంభోధిస్తున్నారు. కీర్తి సురేష్ కు ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news