Moviesనాని అ!.. హిట్టా.. ఫట్టా..!

నాని అ!.. హిట్టా.. ఫట్టా..!

నాని నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంగా చేసిన సినిమా అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా సక్సెస్ అయ్యిందా అంటే కేవలం ఈ సినిమా కథ, కథనాలు మల్టీప్లెక్స్ రేంజ్ వాళ్లకే అని మాత్రం చెప్పొచ్చు. పక్కాగా చెప్పాలంటే ఉమన్ టూ ఉమన్ మ్యారేజ్, జెండర్ చేంజింగ్, డ్రంగ్ ఎడిక్ట్, చెట్ల గొప్పదనం ఇలా ప్రతి ఒక్క సందర్భంలో గొప్ప ప్రయత్నంగా అనిపించిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు రెగ్యులర్ సిని లవర్స్ కు కొంత నిరాశ పరచిందని చెప్పొచ్చు.

సినిమా అంటే ఎంటర్టైనింగ్ అనే ఆలోచనతో చూసే వారికి ఈ సినిమా నచ్చదు. అయితే ఇందులో కూడా డైరక్టర్ చెప్పే పాయింట్ టూ పాయింట్ కథను, కథనాన్ని ఎంజాయ్ చేస్తే మాత్రం కచ్చితంగా అర్ధమవుతుంది. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ సినిమాకే హైలెట్. కథగా చెప్పడానికి చిన్నదే అయినా కథనంలో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది. ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే మల్టీప్లెక్స్ లో హిట్, మాస్ సెంటర్స్ లో కొంత నిరాశ ఎదురు కావచ్చు.

కాని తెలుగు సినిమా మూస ధోరణిలో వెళ్తుంది.. కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కు ఇది కచ్చితంగా పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. కథనంలో కొంత కన్ ఫ్యూజ్ ఉన్నా సినిమా మాత్రం అ!శ్చర్యం కలిగించడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news