Gossipsహంసా నందినిని అంతమంది ఫాలో అవుతున్నారా .?

హంసా నందినిని అంతమంది ఫాలో అవుతున్నారా .?

తన అంద చందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న మిర్చీ బ్యూటీ హంసా నందిని ప్రత్యేక గీతాల్లో మైమరిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఈ సుందరి ప్రత్యేక గీతాల్లో తన అందాల ఆరబోతతో రసిక హృదయాలను మరింత హీట్ పెంచేలా తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మైమరిపిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా మాంచి హ్యాపీ మూడ్ లో వుంది. కారణం ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య మూడు లక్షలు దాటిపోవడమే అంట. ఈ సందర్భంగా హంస నందిని తన సంతోషాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకుంది. తన అభిమానులతో కాసేపు లైవ్ చాట్ చేసి వారిని కూడా సంతోషపరిచింది.

”హాయ్.. అందరికీ హలో. ఎలా వున్నారు మీరు. అందరూ బాగున్నారా. నా ఫేస్ బుక్ 3 లక్షలు ఫేస్ బుక్ ఫాలోవర్స్ కుటుంబంగా మారింది. సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నాను. ఈ విషయంలో నా పై ప్రేమ చూపించి, నన్ను ఎంకరేజ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు” అంటూ ఫేస్ బుక్ లో తన అభిమానులతో చాట్ చేసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ మిర్చి గర్ల్

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news