బిగ్గెస్ట్ ఫైట్ డేట్ వచ్చేసింది మిత్రమా? విన్నర్ ఎవరు? చరిత్ర ఏం చెప్తోంది?

GPSK-K150

సమయం ఆసన్నమైంది మిత్రమా? ఇక మిగిలింది రణమే. అది కూడా రెండు కొదమ సింహాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నాయనేంతగా సన్నాహాలు ఊపందుకున్నాయి. టిడిపి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి పార్టీ వాళ్ళు చిరంజీవి సినిమాను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో మాత్రం ఖైదీని డిస్టర్బ్ చేయగలిగారు. అయితే మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ చాకచక్యంతో థియేటర్స్ విషయంలో ఖైదీ నంబర్ 150దే పైచేయి అయింది. మరీ ముఖ్యంగా నైజాంలో బాలయ్య సినిమాకు థియేటర్స్ కొరత వచ్చింది. దిల్ రాజు కూడా తన సొంత సినిమా శతమానం భవతిని రిలీజ్‌కి రెడీ చేయడంతోనే ఈ ఇబ్బంది. చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ కూడా ఎవరి బలాలను వాళ్ళు నమ్ముకుంటున్నారు. అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకున్నారు. మరి ఎవరు గెలవబోతున్నారు? సినిమాల రిలీజ్‌కి ముందే ఆ విషయం చెప్పడం కష్టం కానీ చరిత్రలో ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ హీరోగా మూడు దశాబ్ధాల పాటు కొనసాగాడు మెగాస్టార్. అదే టైంలో బాలయ్య కూడా చిరంజీవికి వెరీ వెరీ టఫ్ కాంపిటీషనే ఇచ్చాడు. ఇక సంక్రాంతి బరి విషయంలో అయితే బాలయ్యదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ చిరంజీవి, బాలయ్యలు సంక్రాంతికి 14సార్లు బరిలో నిలిచారు. మరీ పాత రికార్డులు మనకెందుకులే గానీ మనకు గుర్తున్నంతవరకూ చూసుకుంటే మాత్రం 2001లో మృగరాజు, నరసింహనాయుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నరసింహనాయుడి గర్జన దెబ్బకు మృగరాజు మర్డర్ అయిపోయింది. ఇక 2004లో అంజి, లక్ష్మీనరసింహా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ పర్యాయం మాత్రం ఇద్దరు హీరోలకు ఆనందం మిగలలేదు. అంజి సినిమా బడ్జెట్ ఫ్లాప్‌గా నలిచింది. లక్ష్మీనరసింహా పాసైంది. కానీ ఆ సినిమా దెబ్బకే బాలకృష్ణ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు మిగిలాయి.

ఆ తర్వాత మళ్ళీ ఇఫ్పుడు ఖైదీ నంబర్ 150, శాతకర్ణి సినిమాలతో తలపడుతున్నారు. ఇంతకుముందువన్నీ కూడా వీళ్ళిద్దిరీ కెరీర్‌లో పెద్దగా ప్రాముఖ్యత లేని సినిమాలు. కానీ ఆ సారి మాత్రం ఒకరిది 150వ సినిమా, ఇంకొకరిది వందో సినిమా. మరి ఈ సారి కూడా బాలయ్య చారిత్రక పురుషుడి కథతో వస్తున్న బాలయ్య చరిత్ర సృష్టిస్తాడా? లేక రైతుల వ్యథకు సంబంధించిన, ప్రస్తుత సమాజానికి, పాలకులకు కచ్చితంగా చెప్పాల్సిన అవసరమున్న కథతో వస్తున్న చిరంజీవి చరిత్ర తిరగరాస్తాడా? ఈ సంక్రాంతి పుంజుల్లో విజేత ఎవరో మరి.

More from my site