Movies‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. దేశం మీసం తిప్పిన...

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. దేశం మీసం తిప్పిన బాలయ్య

Gautamipura Satakarni first day collections report of Telugu states has revealed by trade analysts and it is record figure in Balayya career’s as well as Krish.

2000 సంవత్సరాల క్రితంనాటి చారిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం ఖాయమని రిలీజ్‌కి ముందు సినీజనాలే కాదు, ట్రేడ్ నిపుణులు సైతం అంచనా వేశారు. ఏ స్థాయిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందో.. అంతకంటే ఎక్కువ రిలీజయ్యాక ప్రభంజనం సృష్టిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే.. బాలయ్య తన ప్రతిష్టాత్మక సినిమాతో బాక్సాఫీస్‌ని తురుముతున్నాడు. తొలిరోజు భారీ వసూళ్లే రాబట్టాడు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొదటిరోజు రూ. 9.82 కోట్లు (షేర్) కలెక్షన్స్ సాధించింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే కాదు.. క్రిష్ కెరీర్‌లోనూ రికార్డ్ ఫిగర్. ఓవర్సీస్‌లో కూడా ముఖ్యంగా యూఎస్‌లోనూ ఈ చిత్రం ఊహించిన దానికంటే అత్యధిక వసూళ్లు రాబడుతోందని అక్కడి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా $362,820 (రూ.2.47 కోట్లు) రాబట్టింది. ఇక గురువారంనాడు కూడా మంచి వసూళ్లే రాబట్టిందని ట్రేడ్ లెక్కలు పేర్కొంటున్నాయి.

ఏరియాల వారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 1.88
సీడెడ్ : 2.07
నెల్లూరు : 0.43
కృష్ణా : 0.80
గుంటూరు : 1.64
వైజాగ్ : 0.88
ఈస్ట్ గోదావరి : 0.78
వెస్ట్ గోదావరి : 1.34
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 9.82 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news