Newsమాజీ రాష్ట్రపతి గా మారిన ప్రణబ్... అతను పొందే రాజ...

మాజీ రాష్ట్రపతి గా మారిన ప్రణబ్… అతను పొందే రాజ భోగాల లిస్ట్ చూస్తే దిమ్మ దిరగాల్సిందే!!

ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియడంతో మంగళవారం రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన బంగ్లాకు వెళ్తున్నారు. 340 గదుల ఇంద్రభవనం లాంటి రాష్ట్రపతి భవన్ నుంచి 8 గదుల నివాసానికి ప్రణబ్ మారుతున్నారు. గతంలో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరవాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న ‘10, రాజాజీ మార్గ్’ బంగ్లాలో మాజీ రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ఉండబోతున్నారు. ఆయన ఉండబోతున్న ఇంటిని ఇప్పటికే ప్రణబ్ సందర్శించారు.10, రాజాజీ మార్గ్ 11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది రెండస్తుల భవంతి. మాజీ రాష్ట్రపతి ఈ ఇంటిలోకి వస్తుండటంతో ఇటీవల మరమ్మతులు కూడా చేశారు.

కాగా, మాజీ రాష్ట్రపతిగా ప్రణబ్ రూ. 75వేల పెన్షన్ తీసుకుంటారు. సిబ్బంది వేతనాలు, కార్యాలయం నిర్వహణకు అదనంగా రూ. 60 వేలు కేంద్ర చెల్లిస్తుంది. రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్ ఫోన్, ఒక ప్రభుత్వ కారును ఉచితం వాడుకోవచ్చు. ఉచిత వైద్యంతోపాటు దేశంలో ఎక్కడికైనా మరొక వ్యక్తితో కలసి హయ్యర్ క్లాసులో రైలు, విమానంలో ఉచితంగా ప్రయాణించొచ్చు.ప్రణబ్ నూతన కార్యాలయానికి ప్రవేటు కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు ప్యూన్‌లు ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వమే నియమించింది. ఇక ప్రణబ్ భద్రత వ్యవహారాలను ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. కాగా, మాజీ రాష్ట్రపతి అబ్దులా కలాం మరణాంతరం 10, రాజాజీ మార్గ్ బంగ్లాను కేంద్ర మంత్రి మహేష్ శర్మ వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రణబ్‌కు ఈ భవంతిని కేంద్ర కేటాయించడంతో ఆయన ఖాళీ చేశారు. మహేష్ శర్మ 10, అక్బర్ రోడ్ బంగ్లాకు మారారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news