Movies‘ఫోర్బ్స్’ జాబితాలో మహేష్ దూకుడు.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌ల స్థానాలు ఇవే!

‘ఫోర్బ్స్’ జాబితాలో మహేష్ దూకుడు.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌ల స్థానాలు ఇవే!

Forbes magazine has released the top-100 indian celebrities list in which Mahesh Babu got first place and Allu Arjun second. After them NTR and Ram Charan got the place in top 100.

ఎప్పటిలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదిలో ఆదాయం, ఫాలోయింగ్ ఆధారంగా భారతీయ ప్రముఖులు ఏయే స్థానాల్లో ఉన్నారన్న టాప్-100 జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మహేష్‌బాబు అగ్రస్థానంలో నిలవగా.. అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తర్వాతి చోటు దక్కించుకున్నారు.

ప్రముఖుల జాబితాలో మహేష్ 37వ స్థానంలోనూ, ఖ్యాతి పరంగా 74వ స్థానంలోనూ నిలిచాడు. అల్లుఅర్జున్ విషయానికొస్తే.. ప్రముఖుల జాబితాలో 43వ స్థానంలో నిలవగా, ఖ్యాతిపరంగా మాత్రం 27వ స్థానంలో మహేష్ కంటే ముందే నిలిచాడు. ‘సరైనోడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ 55వ స్థానంలో, రామ్ చరణ్ 67వ స్థానంలో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ 30వ స్థానంలో నిలిస్తే.. ధనుష్‌ (47), కమల్‌ (49), సూర్య (51), విజయ్‌ (61) స్థానాల్లో ఉన్నారు.

బాలీవుడ్ ప్రముఖుల్లో సల్మాన్ తొలిస్థానంలో, షారుఖ్ రెండో స్థానంలో, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మూడోస్థానంలో నిలిచారు. ఖ్యాతి పరంగా మాత్రం కోహ్లీనే మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. అక్షయ్, క్రికెటర్ ధోనీలు 4, 5 స్థానాల్లో నిలిస్తే.. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ఈ సారి టాప్‌-10 జాబితాలో చోటు కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news