Gossipsనాగార్జున నిర్ణయం తో ఫ్యాన్స్ కి షాక్

నాగార్జున నిర్ణయం తో ఫ్యాన్స్ కి షాక్

టాలీవుడ్ సినిమాల్లో ఆర్జివి డైరెక్ట్ చేసిన శివ ట్రెండ్ సెట్టర్ మూవీ. కింగ్ నాగార్జున వర్మ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. పాతికేళ్ల తర్వాత కూడా శివ సినిమా అంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నాగార్జున, వర్మ కలిసి పనిచేయబోతున్నారట. ఈ విషయం వర్మ చెప్పడమే కాదు నాగార్జున కూడా వెళ్లడించారు.

ఈమధ్య మీడియాతో మాట్లాడిన నాగార్జున వర్మతో సినిమా చర్చలు జరుగుతున్నాయని వర్మ అద్భుతమైన కథ చెప్పాడని అన్నారు. అయితే సినిమా ఇంకా కన్ఫామా కాదా అన్నది తెలియలేదు. శివ తర్వాత నాగార్జున వర్మ మీద నమ్మకం ఉంచి మరి చేస్తున్న ఈ సినిమా శివ కన్నా భారీ రేంజ్ లో ఉంటుందని ఊహించవచ్చు.  అనుకున్నట్టుగా సినిమా వస్తే మాత్రం కచ్చితంగా శివ లాంటి సంచలనాలు మళ్ళీ రిపీట్ చేస్తుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఫాం కొల్పోయిన వర్మతో సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ కు మింగుడు పడట్లేదు. ఇక ఇదే కాకుండా నానితో కలిసి చేసే మల్టీస్టారర్ మూవీ గురించి కూడా కన్ ఫాం చేసి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాడు నాగార్జున.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news