Moviesఏరియాల వారీగా ఫిదా వరల్డ్ వైడ్ 10 రోజుల కలక్షన్స్.. కలక్షన్స్...

ఏరియాల వారీగా ఫిదా వరల్డ్ వైడ్ 10 రోజుల కలక్షన్స్.. కలక్షన్స్ లో సరికొత్త ప్రభంజనం

నాలుగు సినిమాలు చేసినా కూడా సరైన హిట్ ఆందుకోని మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ కొట్టిన మొదటి హిట్ ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలక్షన్స్ లో సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. వరుణ్ తేజ్ హిట్ కొడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో అతని సత్తా చూపిస్తుంది ఫిదా మూవీ.

ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన రెండో వారంలో కూడా వసూళ్ల హవా కొనసాగించడం చూస్తుంటే ఈ ఇయర్ లో ఇది బ్లాక్ బస్టర్ హిట్స్ లో నిలిచే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది ఫిదా మూవీ. సినిమా రిలీజ్ అయినా మొదటి వారాంతరంలోనే 1 మిలియన్ టచ్ చేసినా ఫిదా ఇప్పుడు 2 మిలియన్ కలక్షన్స్ క్రాస్ చేసేందుకు పరుగులు తీస్తుంది.

రెండో వారంలో కూడా అత్యధికంగా 6.45 కోట్ల కలక్షన్స్ రాబట్టింది ఫిదా మూవీ. ఇక సినిమా రిలీజ్ అయిన 10 రోజులకు గానౌ 29.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఏరియాల వారిగా ఫిదా 10 రోజుల కలక్షన్స్ వివరాలు :

నైజాం 10.52 కోట్లు, సీడెడ్ 2.50 కోట్లు, ఉత్తరాంధ్ర 2.63 కోట్లు, గుంటూర్ 1.595 కోట్లు, ఈస్ట్ 1.50 కోట్లు, వెస్ట్ 1.12 కోట్లు, కృష్ణా 1.375 కోట్లు, నెల్లొర్ 61 లక్షలు, మొత్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో 21.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఫిదా. ఇక ఇవే కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా 2.20 కోట్లు, ఓవర్సీస్ 5.70 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా 29.75 కోట్లు వసూలు చేసింది. ఫిదా ఫుల్ రన్ లో సరికొత్త ప్రభంజనాలు సృష్టిస్తుందని అనడంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news