Gossips"ఫిదా" పేరుతోనే ఆ సినిమా కూడా ..!

“ఫిదా” పేరుతోనే ఆ సినిమా కూడా ..!

చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఫిదా’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు మలయాళంలోకి ‘ఫిదా’ పేరుతోనే అనువాదమవుతోంది. తాజాగా ‘ఫిదా’ మలయాళం ట్రైలర్ విడుదలైంది. మలయాళంలో హీరోయిన్ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. ‘ప్రేమమ్’ సినిమాలోని మలర్ పాత్రతో మాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ఈ తమిళ బ్యూటీ.

హ్యాపీడేస్ డబ్బింగ్ వెర్షన్‌తో కేరళలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇలా వీరిద్దరి బ్రాండ్ వేల్యూపైనే ఇప్పుడు ‘ఫిదా’ను మలయాళంలో అదే పేరుతో విడుదల చేయబోతున్నారట. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ చిత్రం త్వరలో కేరళలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. తెలుగులో ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్, రూ.50 కోట్ల పై చిలుకు షేర్‌తో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు బంగారు బాతుగా నిలిచింది. చాలా త‌క్కువుగా రూ.7-8 కోట్ల బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. మరి తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ‘ఫిదా’ మలయాళ ప్రేక్షకుల్ని ఇంకెంత ఆకట్టుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news