Moviesదుమ్మురేపుతున్న కలెక్షన్లతో ఫిదా జోరు...అప్పుడే ఆ మార్కుని దాటేసింది...

దుమ్మురేపుతున్న కలెక్షన్లతో ఫిదా జోరు…అప్పుడే ఆ మార్కుని దాటేసింది…

‘ఫిదా’ జోరు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల దుమ్మురేపుతోంది.సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా నడుస్తుంది. జులై ౨౧న్ విడుదల అయిన ఫిదా మొదటి రెండు వారాల్లోనే 60కోట్ల గ్రాస్ సాధించగా..ఇక రెండో వారంలో మంచి టాక్ సొంతం చేసుకోవడంతో 11 కోట్ల షేర్ అందుకోవడం విశేషం.అంతే కాకుండా రెండో వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా బాహుబలి2, ఖైదీ 150 సినిమాల తర్వాతి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారంలో విడుదలైన ఏ సినిమా కూడా పోటీనిచ్చే పరిస్థితిలో లేకపోవడం ఫిదాకు కలిసొచ్చిన విషయం.

ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కాస్త రొమాంటిక్ టచ్ ని కూడా కలిపి శేఖర్ ఈ సినిమాని అందించాడు. అమెరికాలో రెండు వారాల్లోనే 11 కోట్ల పైన కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అటు ట్రేడ్ వర్గాలతో పాటు సినీ జనం కూడా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news