Moviesఫిదా ఇప్పటికి టాపు లేపుతుంది..!

ఫిదా ఇప్పటికి టాపు లేపుతుంది..!

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఫిదా. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఫిదా కలక్షన్స్ మాత్రం షాకింగ్ గానే ఉన్నాయి. ఎలాంటి సినిమా అయినా సరే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ లో మంగళవారం కలక్షన్స్ సినిమా దమ్ము చూపిస్తాయి. అవి కాన్ స్టంట్ గా ఉంటే సినిమా లెక్క తేల్చేయొచ్చు.

ముఖ్యంగా ఫస్ట్ షోకి కలక్షన్స్ కేక పెట్టించేస్తాయి. ఇక ఈ మంగళవారం అక్కడ కలక్షన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. లాస్ట్ ఫ్రైడ్ డే రిలీజ్ అయిన ఆనందో బ్రహ్మ హయ్యెస్ట్ గా 45 వేల సుమారు కలక్షన్స్ తీసుకురాగా.. జయ జానకి నాయకా 28 వేలు తెచ్చిందట. ఇక నేనే రాజు నేనే మంత్రి 26 వేల రూపాయలు టికెట్లు తెగాయట. లై సినిమాకు 11 వేలు, నిన్ను కోరికి 4 వేలు రాగా ఫిదా కు మాత్రం 34 వేల రూపాయలు వచ్చాయట. సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు దాటినా ఫిదా కలక్షన్స్ కు అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news