GossipsTRP తో బుల్లితెరనే అబ్బురపరిచిన ఫిదా

TRP తో బుల్లితెరనే అబ్బురపరిచిన ఫిదా

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఫిదా.. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పక్కాగా చెప్పాలంటే వరుణ్ తేజ్ కు మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా ఫిదా. ఇక ఈ సినిమా ఆల్రెడీ చిన్న సినిమాల్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. అయినా సరే ఇంకా రికార్డులను సృష్టిస్తూనే ఉంది. అదెలా అంటే..
వెండితెర మీద విశ్వరూపం చూపించిన ఫిదా ఇప్పుడు బుల్లితెర మీద కూడా సంచలనం సృష్టిస్తుంది. సినిమా మొదటి రెండు సార్లు కాదు 3వ సారి ప్రదర్శించగా టి.ఆర్.పి రేటింగ్ లో అదరగొట్టింది. మొదటిసారి 21.31 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకున్న ఫిదా.. రెండవసారి 18.5 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. ఇక ముచ్చటగా 3వ సారి 12.3 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. 3 సార్లు వచ్చినా సరే ఫిదా మీద ఆడియెన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.
3వ సారి టెలికాస్ట్ అయినా ఈ రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకోవడం టి.ఆర్.పిలో ఫిదా సరికొత్త సంచలనమే అంటున్నారు. 18 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 48 కోట్ల వసూళ్లను రాబట్టింది. దిల్ రాజు నిర్మాతగా ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాతో శేఖర్ కమ్ముల సత్తా చాటాడు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news