Gossipsఎన్టీఆర్ కి గుడి కట్టిస్తున్న అభిమానులు ... ఎక్కడో తెలిస్తే షాకే...

ఎన్టీఆర్ కి గుడి కట్టిస్తున్న అభిమానులు … ఎక్కడో తెలిస్తే షాకే !

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వీరాభిమానులు అతనికి గుడి కట్టించబోతున్నారు అది కూడా తెలుగు రాష్ట్రాల అభిమానులు కాదు కర్ణాటకలో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ గుడి కట్టించడం జరుగుతుందట. తెలుగు తెర మీద నవరస నటనా ప్రతిభను కనబరుస్తున్న ఈ జూనియర్ తారక్ రాముడు తాత పంచిన వారసత్వంతో అభినవ కళాకారుడిగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు.

ఇక ఈమధ్య కథా బలం ఉన్న సినిమాలు చేస్తున్న ఎన్.టి.ఆర్ కేవలం తెలుగులోనే కాదు కర్ణాటకలో కూడా అభిమానులను సంపాదించాడు. తన సినిమాలు అక్కడ కూడా మంచి ఫలితాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లాప్ అయినా సరే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అది కర్ణాటకలో తారక్ క్రేజ్ కు నిరదర్శనం.

అయితే ఈ గుడి ఎవరు ఎక్కడ ఎప్పుడు కట్టిస్తున్నారు అన్నది ఇంకా డీటేల్స్ తెలియాల్సి ఉంది. ఈమధ్యనే జై లవ కుశతో దుమ్ముదులిపేసిన తారక్ త్వరలో త్రివిక్రం సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news