Moviesఎస్వి. రంగ రావు పాత్రలో మోహన్...

ఎస్వి. రంగ రావు పాత్రలో మోహన్ బాబు

మహానటి సావిత్రి బయోపిక్ గా మహానటి టైటిల్ తో వస్తున్న సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడి మరి ఈ సినిమా తెరకెక్కించారు. స్వప్న సినిమా బ్యానర్లో స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది.

ప్రముఖ నటుడు స్వర్గీయ ఎస్వి రంగ రావు గారు తెలుగు వెండితెర మీద తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తనదైన విలక్షణమైన పాత్రలలో ప్రేక్షకులని ఎంతో రంజింపజేశారు. ఇప్పుడు మహానటి సినిమాలో మోహన్ బాబు ఎస్ వి రంగ రావు గారి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు గారు ఈ పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తారో చిత్రం విడుదలైయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news