Gossipsలవ్ ఎఫైర్స్ పై స్వాతి స్పందన ఏంటో తెలుసా ..?

లవ్ ఎఫైర్స్ పై స్వాతి స్పందన ఏంటో తెలుసా ..?

కలర్స్ స్వాతి గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో. ప్రాయం నుంచే నటన మొదలు పెట్టిన ఈ అమ్మడు అనేక విజయవంతమైన సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్‌‌గా సైతం నటించింది. అయితే  స్వాతి కి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే మాత్రం ఆ స్థాయిలో  హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.
 మంచినటిగా ఈమెకు పేరున్నా అవకాశాలలో మాత్రం స్వాతి ఎప్పుడూ వెనకపడే ఉంటోంది. ఇలాంటి పరిస్థుతులలో గతవారం విడుదలైన ‘లండన్ బాబులు’ సినిమాలో స్వాతి నటనకు ప్రశంసలే అందుకుంది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో స్వాతి నిరాశలో ఉంది.
అయితే ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి తన కెరియర్ కు సంబంధించి ముఖ్యంగా ఆమె ఎఫైర్ల గురించి వచ్చిన వార్తల గురించి చాలఘాటుగా స్పందించింది. హీరోయిన్లను జనాలు చూసే దృష్టి మారాలి అంటూ గట్టిగానే క్లాస్ పీకింది ఈ ముద్దుగుమ్మ.
 సినిమా రంగంలోకి ఎవరు వచ్చినా వాళ్ళ క్యారెక్టర్ని చాలా తప్పుగా చూస్తారని ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదని అంటోంది స్వాతి. ముఖ్యంగా తన విషయంలోనూ ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడుకున్నారని అంటూ తాను ఎక్కువగా బయట కనిపించకపోయినా తాను నటించిన చాలామంది హీరోలతో తనకు ముడిపెట్టారని వాపోతోంది.
 ఈకలర్స్ బ్యూటీ. మొట్టమొదటగా ‘డేంజర్’ సినిమా సమయంలో అల్లరి నరేష్ తో లింకు కలిపారని స్వాతి చెప్పింది. ఆ తర్వాత ‘అష్టాచెమ్మా’ టైంలో నానితో ‘స్వామి రారా’ టైంలో నిఖిల్ తో కూడా ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వ్రాసారని ఇది ఎంతవరకు సమంజసమో చెప్పాలంటోంది. ఇవే కాకుండా.. తాను తమిళంలో సినిమాలు చేసినప్పుడు తనకు కోలీవుడ్ హీరో జై తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వ్రాసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది
నా బాధ గురించి పట్టించుకోకుండా గాసిప్పులు రాయడం మీడియాకు అలవాటుగా మారిందని చురకలు పెట్టింది స్వాతి. అయితే ఇప్పుడు అటువంటి వార్తలను కనీసం చదవడం కూడ మానేసాను అని అంటూ తన పేరు ముందున్న ‘కలర్స్’ అనే పదాన్ని కూడ జనాలు చాలావరకు టీజ్ చేయడానికి ర్యాగింగ్ చేయడానికే ఉపయోగిస్తారని స్వాతి కామెంట్స్ చేసింది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news