Gossipsకళ్లుచెదిరే రేటుకి ‘డీజే’ సీడెడ్ రైట్స్.. కొద్దిలో ఆ రికార్డ్ మిస్?

కళ్లుచెదిరే రేటుకి ‘డీజే’ సీడెడ్ రైట్స్.. కొద్దిలో ఆ రికార్డ్ మిస్?

టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం) ఒకటి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేస్తున్న సినిమా కావడం, సినిమాల మీద మంచి పట్టు వున్న నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ‘డీజే’కి ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. ఇక మొన్నామధ్య రిలీజైన టీజర్‌కి, రీసెంట్‌గా విడుదలైన టైటిల్ సాంగ్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో.. ఈ చిత్రానికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్‌ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇంకేముంది.. దిల్‌రాజు తన బిజినెస్ మైండ్‌సెట్‌తో భారీ రేట్లకు రైట్స్ అమ్ముతున్నాడు. తాజాగా సీడెడ్ రైట్స్‌ని రికార్డ్ రేటుకి అమ్మినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘డీజే’ సీడెడ్ రైట్స్‌ని అక్షరాల రూ.12 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇది బన్నీ కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. దీని ముందు ‘ఖైదీ’ (రూ.11.07 కోట్లు) రికార్డ్ పటాపంచలయ్యింది కానీ.. కాస్తలో ‘కాటమరాయుడు’ (రూ.12.06) రికార్డ్ మిస్ అయ్యింది. ఏదైతేనేం.. పవన్‌కి బన్నీ గట్టి పోటీనే ఇచ్చాడు. దీన్నిబట్టి.. మాస్ ఆడియెన్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన సీడెడ్‌లోనూ బన్నీకి ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. మరి.. అంత అమౌంట్‌ని ‘డీజే’ రికవర్ చేస్తుందా? అనే డౌట్ రాకమానదు. బన్నీ గత చిత్రం ‘సరైనోడు’ అక్కడ 18 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అంటే.. షేర్ విలువ రూ. 10-12 కోట్ల మధ్య వుండొచ్చు. కాబట్టి.. ‘డీజే’ కచ్చితంగా రూ.12 కోట్లను రికవర్ చేస్తుందని, డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. పైగా.. సమ్మర్ సీజన్ కాబట్టి గట్టిగానే వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news