Movies ‘సమయం లేదు మిత్రులారా.. సంక్రాంతి వస్తోంది.. ఖబడ్దార్’

‘సమయం లేదు మిత్రులారా.. సంక్రాంతి వస్తోంది.. ఖబడ్దార్’

For the first time director Jagarlamudi Radhakrishna (krish) has given an energetic speech in Gautamiputra Satakarni audio launch which gives goosebumps to everyone. Step by step he explains how they started this project and made.

రిలీజ్‌కి ముందు తమ సినిమాల గురించి దర్శకనిర్మాతలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. హీరో దగ్గరి నుంచి తీసుకుని.. ఇంకా సినిమాకి పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు చివరికి తమ గురించి కూడా డప్పు వాయించుకుంటారు. సినిమాపై ఆసక్తి కలిగేలా ఏవేవో కహానీలు చెబుతుంటారు. మరికొందరైతే.. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు వినివిని ఆడియెన్సే కాదు.. ఫ్యాన్స్ కూడా విసుగెత్తిపోయారు. కానీ.. తిరుపతి వేదికగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ జోష్ నింపేలా ఉన్నాయి. ఆయన మాట్లాడే తీరు, సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే.. ‘ఇది కదరా భై మనకు కావాల్సిన ఎనర్జీ’ అనే డైలాగ్ మనకు తెలియకుండానే నోటివెంట వచ్చేస్తుంది. అంత పవర్‌ఫుల్‌గా, అద్భుతంగా క్రిష్ స్పీచ్ ఇచ్చాడు.

ప్రారంభంలోనే అతడు చెప్పిన మాటలు వింటే.. రొమాలు నిక్కబొడుచుకుంటాయి. తన తల్లి అంజనాదేవి పేరు తీసుకుని.. ‘అమ్మా.. ఈ సినిమాలో నా పేరు ముందు నీ పేరు రాసుకున్నాను.. ఈ మూవీతో నీ పేరు నిలబెడతాను’ అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత తన భార్య రమ్యా పేరు తీసుకుని.. ‘పెళ్ళయిన తర్వాత పట్టుమని 10 రోజులు కూడా నా అర్థాంగితో ఉండలేదు. నువ్వు, నేను చాలా గర్వపడేలా ఈ సినిమాని తెరకెక్కించాను. నా జీవితంలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్.. ఐ లవ్ యూ’ అంటూ పేర్కొన్నాడు. బహుశా ఇలా ఏ ఆడియో వేడుకలోనూ ఏ దర్శకుడు ఈ విధంగా స్పీచ్ ప్రారంభించి ఉండరు. ఇక ఆ తర్వాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఓ అద్భుతమైన రూపంతో రూపొందించానని తెలిపాడు. అంతేకాదు.. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం, ‘శాతకర్ణి’ గురించి చేసిన పరిశోధనల గురించి వెల్లడించాడు.

ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఏ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడంటే.. అతను చెప్పే మాటలు మనలోనూ ఉత్తేజం నింపుతుంది. సినిమా చూడాల్సిందేనన్న ఆసక్తి కలిగేలా క్రిష్ మాటలు ప్రేరేపించేలా ఉన్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా క్రిష్ రెచ్చిపోయి మాట్లాడాడు. కేవలం మా చిత్రబృందమే కాదు.. తెలుగువాళ్లు మొత్తం గర్వపడేలా ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించానని అన్నాడు. ఇలా ఎప్పుడూలేని విధంగా ఎనర్జీగా మాట్లాడిన క్రిష్.. ‘సమయం లేదు మిత్రులారా.. సంక్రాంతి వస్తోంది.. ఖబడ్దార్’ అంటూ ముగించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news