Movies ‘శాతకర్ణి’ ట్రైలర్.. అంజనాపుత్రుడు క్రిష్‌ ప్రతిభకు జోహార్లు

‘శాతకర్ణి’ ట్రైలర్.. అంజనాపుత్రుడు క్రిష్‌ ప్రతిభకు జోహార్లు

Director Krish getting huge applause from all over by showing his talent with Gautamiputra Satakarni Trailer. It is really wonder to make this type of film in just 8 months of time span within 50 crore budget.

టాలీవుడ్‌లో గర్వించదగిన అతికొద్దిమంది టాలెంటెడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). తాను తీసిన ప్రతి సినిమాతోనూ ఓ సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఆ సినిమాలు ప్రతిఒక్కరినీ ఆలోచింపజేశాయి. క్రిష్‌లో దాగివున్న ప్రతిభని చాటిచెప్పాయి. అలాంటి దర్శకుడు.. బాలయ్య ప్రెస్టీజియస్ 100వ ప్రాజెక్ట్ కోసం తొలిసారి ఓ చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. అంతేకాదు.. ప్రీ-ప్రొడక్షన్ పనులతో కలుపుకుని సినిమా మొత్తాన్ని 8 నెలల్లో కంప్లీట్ చేస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు.

మొదట్లో ఈ విషయం తెలియగానే అందరూ ఖంగుతిన్నారు. ఎందుకంటే.. సాధారణంగా హిస్టారికల్ సినిమాల్ని తెరకెక్కించాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆనాటి చరిత్రను తలపించేలా భారీ సెట్టింగ్స్, ఇతర పనులకే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అలాగే.. యుద్ధ సన్నివేశాలకు కూడా. దర్శకధీరుడు రాజమౌళి కూడా ‘బాహుబలి’ని తెరకెక్కించడానికి ఏకంగా నాలుగేళ్లు తీసుకున్నాడు. పైగా దానికి రూ.200 కోట్లపైనే బడ్జెట్ అయ్యింది. అలాంటిది.. కేవలం 50 కోట్లలోపు బడ్జెట్‌తో క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక సినిమాని 8 నెలల్లోనే ఎలా తెరకెక్కిస్తాడా? అని ఆలోచనలో పడిపోయారు. క్రిష్ తప్పటడుగు వేస్తున్నాడేమోనన్న సందేహాలూ వ్యక్తం చేశారు. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగలడా? అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అయితే.. అలా కామెంట్స్ చేసిన వాళ్లందరి నోళ్లను ఒక్క ట్రైలర్‌తోనూ మూయించేశాడు క్రిష్.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అన్న పేరు తప్ప ఆనాటి ఆనవాళ్లు కూడా తెలియని చారిత్రాత్మక సినిమాని తాను చెప్పినట్లుగానే 8 నెలల వ్యవధిలో కళ్లుచెదిరే రీతిలో తెరకెక్కించాడు క్రిష్. ట్రైలర్ మొదలైనప్పటి నుంచి చివరివరకు.. అందరూ కళ్ళప్పగించి చూసేంత అద్భుతంగా సాక్షాత్కరించాడు. సింహ ద్వారం తెరవడంతో ట్రైలర్‌ను ప్రారంభించిన వెంటనే.. సముద్రంలో భారీ నౌకలతో యుద్ధానికి వెళ్లడం.. ఆ తర్వాత వేలాది మంది సైనికులతో ఓ విజువల్.. పచ్చని ప్రాంతంలో ఎర్రని కవచాలు ధరించిన వేలాదిమంది సైన్యంతో యుద్ధం.. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన ఫ్రేములతో నిండిన ఈ ట్రైలర్‌ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి విజువల్స్‌ని 8 నెలల టైంలో తెరకెక్కించి.. పూర్తిస్థాయిలో మెప్పించిన క్రిష్ టాలెంట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఓవైపు బడా దర్శకనిర్మాతలు ఇలాంటి కళాఖండాలను తెరకెక్కించడం కోసం వందలకోట్లు ఖర్చు పెడుతుంటే.. క్రిష్ మాత్రం రూ.50 కోట్లలోపే కళ్ళుచెదిరే విజువల్స్‌తో దిమ్మతిరిగేలా చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ మూవీ గ్రాఫిక్స్ కోసం కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించారు. అవును.. మీరు చదువుతోంది నిజమే. అద్భుతమైన దృశ్యాలను అందించేందుకు అత్యధికంగా ఖర్చు చేయనవసరం లేదని సాంకేతికంగా నిరూపించేశాడు కూడా. తీయాలని తపన ఉంటే.. ఏళ్లకొద్దీ సమయం, కోట్లకొద్దీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిరూపించిన క్రిష్‌ని ఎంత అభినందించినా తక్కువే. ఇక ఇటువంటి సినిమాకి తనవంతు పూర్తి సహకారాన్ని అందించిన బాలయ్యకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news