Gossipsఎన్టీఆర్‌కి అభిషేక్ హ్యాండ్ ఇస్తే.. బాబీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు!

ఎన్టీఆర్‌కి అభిషేక్ హ్యాండ్ ఇస్తే.. బాబీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు!

After three months of long gap, Young tiger NTR finally gives green signal to Director’s Bobby script which is narrated by Kona Venkat. They almost prepared everthing to start this project as soon as possible. But, in the last minute Kona has given ultimate shock to unit. Read the full story to know more details.

‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆ రేంజ్ హిట్ అందించే స్టోరీ కోసం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మూడు నెలలు వెయిట్ చేశాడు. మధ్యలో కొందరు దర్శకులు స్టోరీలు వినిపించారు కానీ.. అవేవీ ఆసక్తికరంగా లేకపోవడంతో ఒప్పుకోలేదు. చివరికి.. డైరెక్టర్ బాబీ చెప్పిన ఓ కథకి ఫ్లాట్ అయిపోయి, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఆలస్యం అయిందని భావించి.. సినిమాని త్వరగా ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుపుకుంటున్న తరుణంలో.. రైటర్ కోన వెంకట్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దాంతో.. తారక్ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది. ఇంతకీ.. కోనకి, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా! నిజానికి.. ఎన్టీఆర్‌కి బాబీ వినిపించిన స్టోరీని రాసింది కోన వెంకటే. ఆయన వద్ద నుంచి ఆ కథ తీసుకున్న బాబీ.. కాస్త మార్పులు చేర్పులు చేసి ఎన్టీఆర్‌కి వినిపించాడు. అయితే.. ఈ కథని తాను ఆల్రెడీ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి వినిపించానని, రైట్స్ కూడా అమ్మేశానని కోన తాపీగా చెప్పాడు. దీంతో కాస్త షాక్‌కి గురైన బాబీ.. అభిషేక్‌ని బుజ్జగించి కథని తీసుకుందామని ప్రయత్నించాడు. నిర్మాతలతో భారీ అమౌంట్ ఇప్పిస్తానని కూడా అన్నాడు. కానీ.. అభిషేక్ మాత్రం ఛస్తే ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. దీంతో.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవచ్చునన్న అనుమానాలు రేకెత్తగా.. దానికి జవాబుగా బాబీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

ఎలాగైనా తారక్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిన బాబీ.. తన దగ్గరున్న బోలెడన్నీ కథల్లో నుంచి ఒకదాని స్టోరీ లైన్‌ని తారక్‌కి వినిపించాడు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో.. పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమని పచ్చజెండా ఊపాడు. అంతే.. అప్పటినుంచి బాబీ స్ర్కిప్ట్‌పై కూర్చున్నాడు. దాదాపు ఇది చివరిదశకు చేరుకుందని, త్వరలోనే వీరి ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news