Gossipsరోజాతో “గాడ్, సెక్స్ & ట్రూత్ – పార్ట్ 2”

రోజాతో “గాడ్, సెక్స్ & ట్రూత్ – పార్ట్ 2”

ఇటీవల ఆర్జివి తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా ఎలా ఉందో తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. శృంగారం అనేది ఒక చర్య కాదు అని చెబుతూ వర్మ తీసిన ఈ జిఎస్టి ఎఫెక్ట్ బాగానే పడిందని చెప్పాలి. అలా ఎందుకు అంటే రోజా ఒప్పుకుంటే ఆమెతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2 తీస్తా అని అంటున్నాడు ప్రముఖ దర్శకుడు అజయ్ కౌండిన్య.

తాను తీసిన చిన్న సినిమాకు థియేటర్లు దొరకలేదని నానా హంగామా చేసిన ఇతను ఇప్పుడు తన డైరక్షన్ లో వచ్చిన బూత్ బంగ్లా సినిమాకు వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక పనిలో పనిగా సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, వైసిపి ఎమ్మెల్యే రోజా, పవన్ కళ్యాణ్, గాయత్రి గుప్తాల గురించి మాట్లాడాడు.

ఓ ఎమ్మెల్యే అయిన రోజా ప్రపంచంలో ప్రతి సమస్య గురించి మాట్లాడుతుంటారు కాని సిని పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం నోరు మెదపరని అన్నాడు. ఇండస్ట్రీలో ఉన్న అమ్మయిలు, టెక్నిషియన్స్ అందరు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆమె ఏమి చేయడం లేదని అన్నారు. సీనియర్ నటి రోజాకు పాదాభివందనం అంటూ మొదలు పెట్టి ఆమె ఒప్పుకుంటే జిఎస్టి పార్ట్ 2 ఆమెతో తీస్తా అని పెద్ద దుమారం రేపాడు. మరి వీటిపై రోజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news