Gossipsదిల్ రాజుతో పవన్ అలా ఎందుకు చెప్పాడు..?

దిల్ రాజుతో పవన్ అలా ఎందుకు చెప్పాడు..?

ఇకపై సినిమాలు చెయ్యను… కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడంలేదు అంటూ పవన్ గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. దీంతో అందరూ ఇక పవన్ ఆఖరి సినిమా ‘అజ్ఞాతవాసి’ అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలోనే స్టార్ పోడ్యూసర్ దిల్ రాజు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. త్వరలో పవన్ తో ఓ సినిమా చేయబోతున్నామని చెప్పి అందరిని గందరగోళంలో పడేసాడు.

దిల్ రాజు కి పవన్ తో ఓ సినిమా తీసి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో ఓ కోరిక. అందుకు చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. పవన్ కూడా ఎన్నికలు సమీపిస్తుండడంతో ఒకా సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పబోతున్నట్టు చెప్పాడు. కానీ దిల్ రాజు మాత్రం పవన్ నుంచి సినిమా చేసేలా ఏదో హామీ పొందినట్టుగా మాట్లాడుతున్నాడు.

కొద్దీ రోజుల క్రితమే నేను పవన్ ని కలిశానని .. తనతో సినిమా చేసే విషయంలో పవన్ ఒక హామీ ఇచ్చాడని దిల్ రాజు చెప్పుకొస్తున్నాడు. మంచి స్క్రిప్టుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గరికి రావచ్చని.. తన రాజకీయాలు.. తన కమిట్మెంట్లు అవన్నీ పక్కనపెట్టి సినిమా చేస్తానని పవన్ తనతో అన్నాడని రాజు ధీమాగా చెప్తున్నాడు. ఏదైనా మంచి కథ దొరికితే మా సొంత బ్యానర్ నుంచి తప్పకుండా పవన్ తో ఓ మంచి సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్తున్నాడు.

ఈ వార్త తెలిసాక అంతుపట్టని విష్యం ఒకటి అందరిలోనూ మెదులుతోంది. అదేంటంటే… నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు… పూర్తిస్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పుతా అని చెప్పుకొచ్చిన పవన్ ఇప్పుడు దిల్ రాజు తో సినిమాకి ఎలా ఒప్పుకున్నాడో తెలియక అందరూ డైలమాలో ఉన్నారు. ఇంతకీ పవన్ దీనిమీద ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news