Movies‘ధృవ’నాలుగురోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన చరణ్

‘ధృవ’నాలుగురోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన చరణ్

Ram Charan’s latest film Dhruva has also earned very well at the domestic boxoffice of Telugu states on Monday. This proves how the film attracts the people and become a hit.

ఏ సినిమా అయినా.. ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లే రాబడుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలయ్యే చిత్రాల టికెట్స్‌ని ముందుగానే బుక్ చేసుకోవడం కలిసొచ్చే అంశం అయితే.. పాజిటివ్ టాక్ కారణంగా మిగతా రెండురోజులు (శని,ఆది) సంతృప్తికరమైన వసూళ్లు వస్తాయి. అసలైన టెస్ట్ ఉండేది మాత్రం ఆ తర్వాతిరోజే. అంటే.. సోమవారం అన్నమాట. అది వర్కిండ్ డే కాబట్టి.. చాలామంది పనుల్లో బిజీ అయిపోతారు. ఫలితంగా వసూళ్లు బాగా తగ్గిపోతాయి. అలాకాకుండా డీసెంట్ కలెక్షన్స్ వస్తే మాత్రం.. అందులో మేటర్ ఉందని, ఆడియెన్స్ ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారని స్పష్టమైనట్టే. అంటే.. మండే టెస్ట్ పాసయిపోయినట్లే.

తాజాగా ‘ధృవ’ చిత్రం ఆ పరీక్షలో సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయిపోయింది. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం.. సోమవారం కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టి, సత్తా ఉన్న సినిమానేనని ప్రూవ్ చేసుకుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఫస్ట్ వీకెండ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.81 కోట్లు వసూలు చేసిన ‘ధృవ’.. వీక్ డే అయిన సోమవారంనాడు రూ.3.89 కోట్లు రాబట్టింది. దీంతో.. మొత్తం నాలుగు రోజుల్లో ఈ మూవీ ఖాతాలో రూ.25.70 కోట్లు చేరిపోయాయి. వర్కింగ్ డే నాడు కూడా ఆ రేంజ్ వసూళ్లు కలెక్ట్ చేయడం నిజంగా విశేషమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్లే ఈ రేంజ్ కలెక్షన్లు రాబడుతోందని, కరెన్సీ ఎఫెక్ట్‌ని కూడా ఎదుర్కొని దూసుకెళుతోందని అంటున్నారు.

ఏరియాల వారీగా నాలుగు రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 8.74
సీడెడ్ : 4.40
వైజాగ్ : 3.18
ఈస్ట్ గోదావరి : 1.98
వెస్ట్ గోదావరి : 1.77
కృష్ణా : 1.86
గుంటూరు : 2.96
నెల్లూరు : 0.81
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 25.70 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news