Movies‘ధృవ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. తారాజువ్వలా దూసుకెళుతున్న చరణ్

‘ధృవ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. తారాజువ్వలా దూసుకెళుతున్న చరణ్

Ram Charan’s latest movie dhruva is doing very well at the domestic boxoffice in Telugu States. This movie has earned more than 20 crores in it’s first weekend run which is huge in Ram’s career.

గత శుక్రవారం (09-12-2016) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడం, అన్నిచోట్లా హిట్ టాక్ సంపాదించుకోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఇది ప్రభంజనం సృష్టిస్తోంది. కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్‌ని కూడా ఎదుర్కొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

తొలిరోజు (శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.10.59 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు (శనివారం) మాత్రం రూ.4.87 కోట్లతో నిరాశ పరిచింది. అయితే.. మూడోరోజైన ఆదివారం మాత్రం అనూహ్యమైన కలెక్షన్లు రాబట్టి ఆశ్చర్యంతో ముంచెత్తింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ఆదివారంనాడు రూ.6.35 కోట్లు రాబట్టింది. దీంతో.. మొత్తం మూడురోజుల్లో ఈ చిత్రం ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి రూ.21.81 కోట్లు తన ఖాతాలో జమ చేసుకుంది. మరో విశేషం ఏమిటంటే.. సోమవారం కూడా ఈ చిత్రం చాలా ఏరియాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్‌గా, తనదైన శైలిలో తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా కనిపించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అరవింద్ స్వామీ కూడా అతనికి ధీటుగా స్టైలిష్‌గా కనిపిస్తూనే నటనతో అదరగొట్టాడు. చరణ్, స్వామీకి మధ్య సాగే సీన్లే ఈ చిత్రానికి ప్రధానికి బలం. మొత్తానికి.. ఈ మూవీతో చరణ్ అద్భతమైన రీఎంట్రీ ఇచ్చి.. తారాజువ్వలా దూసుకెళుతున్నాడు.

ఏరియాల వారీగా మూడురోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 7.21
సీడెడ్ : 3.88
ఉత్తరాంధ్ర : 2.68
గుంటూరు : 2.64
ఈస్ట్ గోదావరి : 1.58
వెస్ట్ గోదావరి : 1.55
కృష్ణా : 1.54
నెల్లూరు : 73
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 21.81 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news