Movies‘ధృవ’ 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. సెకండ్ వీకెండ్‌లో వసూళ్లు...

‘ధృవ’ 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. సెకండ్ వీకెండ్‌లో వసూళ్లు వర్షం

Dhruva earned very well at the domestic boxoffice of worldwide in the second weekend. This movie running towards 50 crores.

ఫస్ట్ వీకెండ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించిన తర్వాత వీక్ డేస్‌లో ‘ధృవ’ కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ముఖ్యంగా.. బుధ, గురువారాల్లో దారుణమైన వసూళ్లు వచ్చాయి. దీంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అప్పుడే చతికిలపడిపోయిందని అంతా భావించారు. పైగా.. గత శుక్రవారం ఐదు చిన్న సినిమాలు రిలీజవ్వడంతో, వాటి ప్రభావం ‘ధృవ’ వసూళ్లపై కచ్చితంగా పడుతుందని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఆ ఐదు సినిమాలు బోల్తాపడిపోగా.. ‘ధృవ’ వసూళ్లు మరింత పుంజుకున్నాయి. ఊహించని రేంజులో ఈ చిత్రం రెండో వారాంతంలో వసూళ్లు రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లో రూ.42.19 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం, రెండో వారాంతం (శుక్ర+శని+ఆది)లో రూ.5.86 కోట్లు కొల్లగొట్టింది. అంటే.. మొత్తం పదిరోజుల్లో ఈ మూవీ రూ.48.05 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి.. ఈ మూవీతోనూ చరణ్ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరనున్నాడన్నమాట. డీమోనిటైజేషన్ రోజుల్లోనూ సెకండ్ వీకెండ్‌లో అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషంగా చెప్పుకోవచ్చు. గత శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, ఇతర పెద్ద మూవీలేవి రిలీజ్ కాకపోవడం ఈ సినిమాకి బాగానే కలిసొచ్చాయని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఏరియాలవారీగా 10 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 12.55
సీడెడ్ : 5.71
వైజాగ్ : 4.45
గుంటూరు : 2.96
ఈస్ట్ గోదావరి : 2.64
కృష్ణా : 2.51
వెస్ట్ గోదావరి : 2.27
నెల్లూరు : 1.13
ఏపీ+తెలంగాణ : రూ. 34.22 కోట్లు
కర్ణాటక : 6.23
ఓవర్సీస్ : 6.10
రెస్టాఫ్ ఇండియా : 1.50
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 48.05 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news