Movies మరోసారి అడ్డంగా దొరికిన దేవిశ్రీప్రసాద్.. ‘ఖైదీ’ బ్యాక్‌గ్రౌండ్‌ని మక్కీకి మక్కీ...

మరోసారి అడ్డంగా దొరికిన దేవిశ్రీప్రసాద్.. ‘ఖైదీ’ బ్యాక్‌గ్రౌండ్‌ని మక్కీకి మక్కీ దించేశాడు

devi sri prasad copied khaidi no 150 teaser background from sultan.

ఎస్ఎస్ థమన్ ఎఫెక్టో లేక మరో కారణమో తెలీదు కానీ.. కొత్త కొత్త ట్యూన్స్‌తో కైపెక్కించే దేవిశ్రీప్రసాద్ కూడా ఈమధ్య కాపీ కొడుతున్నాడు. మహేష్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీమంతుడు’కి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని ‘ఇంద్ర’ నుంచి మక్కీకి మక్కీ దించేశాడు. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’లోని మూడు పాటల ట్యూన్స్‌నీ కాపీ కొట్టాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఖైదీ నెంబర్ 150’కి ఇచ్చిన బీజీఎమ్ కూడా కాపీ కొట్టిందే.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ మూవీలోని టైటిల్ సాంగ్‌లోని ఓ ట్యూన్‌ని దేవిశ్రీ ప్రసాద్ కాపీ కొట్టి.. అదే ‘ఖైదీ’ టీజర్‌కి అందించాడు. కాస్త కూడా ఛేంజ్ చేయకుండా సేమ్ అలాగే దించేశాడు. దీంతో.. దేవిపై మెగాఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాకరాక వస్తున్న తమ అభిమాన నటుడి సినిమాకి కాపీ ట్యూన్స్ అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news