Gossipsతారక్ కి గుడ్ బై.. ఏం జరిగింది..?

తారక్ కి గుడ్ బై.. ఏం జరిగింది..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గ పేరు తెచ్చుకున్నారు. తనదైన డైలాగ్స్ తో మాటల మాంత్రికుడు అనిపించుకున్నారు.కానీ అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత ఈ డైరెక్టర్ కథల ఎంపిక లో చాల జాగ్రత్త గ వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మొదటగా యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొంత వరకు ఆలస్యంగా జరుగుతుందని చిత్ర వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ తన కథలో కొన్ని మార్పులు చేసారని, క్లైమాక్స్ పార్ట్ లో హీరో ని మరికొంత ఎలివేట్ చేసేలాగా కథని మార్చారని ఇండస్ట్రీ సమాచారం.

ఇక ఈ ఆలస్యానికి మరో ప్రధాన కారణం ఎన్టీఆర్ అని వినిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా కుటుంబ కథ చిత్రం కావడంతో ఎన్టీఆర్ తన ఫిజిక్ లో పూర్తిగా వేరియేషన్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఎన్నో కఠినమైన వర్కవుట్స్ చేసారు మన యంగ్ టైగర్. ఆ మధ్య సోషల్ మీడియా లో దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

టాప్ ఫిటినెస్ ట్రైనర్ గా గుర్తింపు పొందిన లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఈ వర్కౌట్స్ సాధన చేసారు. ఇప్పుడు తారక్ కు గుడ్ బై చెబుతున్నట్లు.. తారక్ డెడికేషన్ చూసి షాక్ తిన్నట్లు చెబుతున్న లాయిడ్.. హైదరాబాద్ వదిలి వెళ్లే టైం వచ్చిందని అంటున్నారు.
హైదరాబాద్ లో ప్రస్తుతానికి పని అయిపోయింది. తారక్ వర్క్ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందని లాయిడ్ స్టీవెన్స్ తెలిపారు. ఇంత తక్కువ కాలంలో ఇలాంటి కఠినమైన వర్కౌట్స్ చేయడం తారక్ కి మాత్రమే సాధ్యమని అయన తెలిపారు. ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్ వలనే ఇది సాధ్యపడిందని లాయిడ్ స్టీవెన్స్ చెప్పారు. ఈ కొత్త లుక్ తారక్ అభిమానులకి తప్పకుండ నచ్చుతుందని. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటించబోతున్న #RRR కోసం మళ్లీ తాను వస్తానని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news