Gossipsఅక్కినేని వారింటి కోడలికి ఎందుకింత భయం

అక్కినేని వారింటి కోడలికి ఎందుకింత భయం

విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న చిత్రాల జాబితాలో  రాజు గారి గ‌ది – 2 చేరిపోయింది. ఓ వైపు పెళ్లి హడావుడి మ‌రోవైపు సినిమా రిలీజ్ రెండూ అక్కినేని వారింట సంద‌డిని తీసుకువస్తున్నాయి. థ్రిల్ల‌ర్ ప్ర‌ధానాంశంగా తీసిన‌ప్ప‌టికీ ఎంట‌ర్ టైన్‌మెంట్ మిస్  కానీయ‌కుండా టేకింగ్ ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ ఓంకార్ చెబుతున్న మాట‌. గ‌త చిత్రం మంచి టాక్ తెచ్చుకోవ‌డం నాగ్ ఎంతో న‌చ్చి చేసిన క‌థాంశం ఇది కావ‌డం సినిమా మార్కెటింగ్ కి ప్ర‌ధాన కార‌ణాల‌య్యాయి. రాజు గారి గ‌ది తో అటు హాస్యాన్ని ఇటు భ‌యాన్నీ రెండింటినీ స‌మంగా మేళ‌వించి త‌క్కువ బ‌డ్జెట్ లోనే మంచి వ‌సూళ్లు సాధించాడు డైరెక్ట‌ర్ ఓంకార్‌. ఈ సారి గ్రాఫిక్ వ‌ర్క్ కి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు నాగ్ చెబుతున్నాడు. అక్టోబ‌ర్ 13న రాబోతున్న ఈ సినిమా అటు ఓంకార్ కి ద్వితీయ విఘ్నం గ‌ట్టెక్కిస్తుందా లేదా అన్న‌ది చూడాలి.

ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్ : దెయ్య‌మంటే బయ్యం

ఇంత‌వ‌ర‌కూ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తోనే మెప్పించిన స‌మంత వీలున్న ప్ర‌తిసారి న‌ట‌న‌కు ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. ఈ గ‌దిలో ఆమె న‌ట‌న ఎలా ఉంటుంది అన్న‌దే ఆస‌క్తిదాయకం. దెయ్యాలంటే భ‌య‌ప‌డిపోయే నాగ్ చైత‌న్య ఈ సినిమా చూడ‌డ‌ని చెబుతున్నాడని అంటున్నాడు నాగ్. ఎందుకంటే స‌మంత ఈ సినిమాలో దెయ్యం పాత్ర పోషించింద‌ని, తానెంతో ధైర్యం చేసి ఈ పాత్ర పోషించింద‌ని తెలిపాడు.సీరత్‌ కపూర్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సిన్మా ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆశిద్దాం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news