Gossipsపవన్ ని ఇబ్బంది పెడుతున్న త్రివిక్రమ్

పవన్ ని ఇబ్బంది పెడుతున్న త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు అంతా తన్మయత్వంతో ఊగిపోతుంటారు. ఇక పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. పవన్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఇప్పుడు త్రివిక్రమ్ వాడుకోవాలని చూస్తున్నాడు.

కర్ణాటక లో కూడా పవన్ అజ్ఞాతవాసి సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ కోసం “అజ్ఞాతవాసి” సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి బెంగుళూరులో చేయాలనీ త్రివిక్రమ్ ఇప్పటికే ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు భారీ బడ్జెట్‌ సినిమాలకు.. బెంగుళూరు మార్కెట్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ లో పెరిగింది. దాంతో “అజ్ఞాతవాసి” విడుదలకు ముందు బెంగుళూరులో పవన్ కళ్యాణ్ ని పిలిచి భారీగా ప్రమోషన్ చేయాలని అన్నది త్రివిక్రమ్ ఆలోచన. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పనులతో బిజీ గా ఉన్నాడు. మరి ఇలా అనుకోని విధంగా తనని ఇబ్బందికి గురి చేసిన త్రివిక్రమ్ అభిప్రాయానికి పవన్ ఒకే చెప్తాడో లేక హ్యాండ్ ఇస్తాడో చూడాలి. ఏమైనా పవన్ ని త్రివిక్రమ్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అర్ధం అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news