Gossipsఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆపేసిన రాజమౌళి...!

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆపేసిన రాజమౌళి…!

నందమూరి హీరో ఎన్టీఆర్,క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనగానే నందమూరి, అభిమానులు పండగ చేసుకున్నారు. ఆ సినిమాకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. పవన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అందరూ భావించారు. అయితే తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందనే ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చెక్కెర్లు కొడుతోంది.

ఇది ఇలా ఉండగానే మొన్న ఈ మధ్య రాజమౌళి ట్విట్టర్‌లో ఓ ఫోటొ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో లో రాజమౌళి ఎన్టీఆర్‌తో పాటు మెగా హిరో రాంచరణ్ కుడా ఉన్నాడు. అదే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం అయ్యిందో ఏమో కానీ పుకార్లు మాత్రం బాగా వినిపించాయి.

రాజమౌళి ఎన్టీఆర్-రాంచరణ్ కంబీనేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వీరిద్దరు గతంలో రాజమౌళితో కలిసి పని చేసి బ్లాక్ బ్లస్టర్ హిట్స్ సాధించారు. ఈ సినిమాలో ఒకరు హీరో మరొకరు విలన్‌గా చేస్తారని సమాచారం. పూర్తి వివరాలు రాజమౌళి త్వరలో తెలియజేస్తారని టాక్. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్‌ను పక్కన పెట్టారు అని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హిరోగా అజ్ఞతవాసి అనే సినిమా చేస్తున్నారని , రాజమౌళి సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్.అయితే దీనికి సంభందించి అటు ఎన్టీఆర్ నుంచి కానీ, త్రివిక్రమ్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అసలు ఏది నిజం ఏది అబద్దం అనే సందేహం లో ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news