Gossipsబ్రేకింగ్ న్యూస్ : రంగస్థలం ప్రమోట్ చేస్తున్న ఎన్టీఆర్..

బ్రేకింగ్ న్యూస్ : రంగస్థలం ప్రమోట్ చేస్తున్న ఎన్టీఆర్..

మెగా పవర్ స్టార్ రాం చరణ్ చిట్టిబాబు అవతారమెత్తి వస్తున్న సినిమా రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో చరణ్ ఇదవరకు ఎన్నడూ చేయని పాత్రలో రంగస్థలం వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్.టి.ఆర్ ను వాడాలని అనుకున్నాడట సుకుమార్. అదేంటి చరణ్ లాంటి హీరో సినిమాకు మళ్లీ ప్రత్యేకంగా ఎన్.టి.ఆర్ తో ప్రమోషన్స్ ఎందుకు అంటే.. ఇక్కడే చిన్న లాజిక్ ఉందని అంటున్నారు.

అసలు ఈ రంగస్థలం కథ ఎన్.టి.ఆర్ కోసం రాసుకున్నాడట సుకుమార్. తారక్ ను కలిసి కథ కూడా వినిపించాడట. కథ నచ్చినా ఎందుకో అతను ఓకే చెప్పలేదట. ఎన్.టి.ఆర్ కాకుండా చరణ్ కు ఈ పాత్ర కొత్తగా ఉంటుందని సుక్కు చరణ్ తో సినిమా చేశాడు. అయితే సినిమా ఎలాగు కాదన్నాడు కాబట్టి రంగస్థలం ప్రమోషన్స్ లో అయినా ఎన్.టి.ఆర్ ను వాడాలని చూశాడు సుకుమార్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ అందుకు కూడా నిరాకరించాడట. ప్రస్తుతం త్రివిక్రం సినిమా కోసం వర్కవుట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తాడట. అందుకే అసలు ఎన్.టి.ఆర్ లుక్ ఎక్కడ లీక్ చేయట్లేదు. అయితే అన్న కళ్యాణ్ రాం నటించిన ఎం.ఎల్.ఏ సినిమా ప్రమోషన్స్ కు మాత్రం సై అన్నాడట తారక్.

నిన్న జరిగిన ఎం.ఎల్.ఏ ప్రా రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ కాకున్నా సరే ఎం.ఎల్.ఏ సినిమా ప్రమోషన్స్ కు ఎప్పుడు పిలిచినా ఓకే అన్నాడట. సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేసినా సరే రంగస్థలం కు ఎన్.టి.ఆర్ నాట్ ఓకే అంటున్నాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news