Gossipsతారక్ - చెర్రీ సినిమాకి మెగా బ్రదర్స్ కి లింకేంటి ..?

తారక్ – చెర్రీ సినిమాకి మెగా బ్రదర్స్ కి లింకేంటి ..?

దర్శక బాహుబలి రాజమౌళి ఏమి చేసినా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఈ మధ్య ఆయన పాపులారిటీ బాగా పెరిగిపోవడంతో… ఆయన ఏది చేసినా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొన్నామధ్య చెర్రీ, తారక్ ల ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఏ విషయం చెప్పకుండా… మీరే కనుక్కోండి అన్నట్టు వదిలేసాడు. ఆ తరువాత తీరిగ్గా .. ఆ ఫోటో వెనుక ఉన్న అసలు మేటర్ బయటకి చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ జక్కన్న ముల్టీ స్టార్ సినిమా గురించిన ఓ వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది.

తారక్ -చెర్రీ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. దీంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో బాగా చూపించారట. అసలు ట్విస్ట్ కూడా ఇక్కడే ఉంది. ఈ సినిమాలో ఫామిలీ బ్యాగ్రౌండ్ కి మూలాధారంగా మెగా ఫ్యామిలీ నుంచే తీసుకున్నారట. అందుకే ఏఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో చెర్రీ, పవర్ స్టార్ పాత్రలో తారక్ కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.

అసలే మంచి క్రేజ్ మీద ఉన్న యంగ్ హీరోలు చెర్రీ- తారక్ లు ఈ సినిమాలో నటిస్తుండడం, మెగా ఫ్యామిలీ స్టోరీ కావడంతో ఈ సినిమా మీద అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెంచేసుకున్నాడు. ఈ సినిమాలో మా అభిమాన హీరోలు ఎలా కనిపించబోతున్నారో అని ఫ్యాన్స్ తెగ కలవరించేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు. దీనిమీద జక్కన్న క్లారిటీ ఇవ్వాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news