Gossips'కడప' వర్మను కటకటాలపాలు చేయబోతోందా ..?

‘కడప’ వర్మను కటకటాలపాలు చేయబోతోందా ..?

రాంగోపాల్ వర్మ తిన్నగా ఉండదు కదా ఎప్పుడూ అతడికి వివాదాలే కావాలి లేకపోతే నిద్ర పట్టదేమో. అందుకే కావాలని ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించుకుని వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కడప రాయలసీమ రెడ్ల చరిత్ర వెబ్ సిరీస్ వివాదం ముదురుతోంది. రాయలసీమ రెడ్లపై ‘కడప’ పేరుతో వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయటంతో వివాదానికి మరింత ఆజ్యం పోశారు.

రాయలసీమ రెడ్లు అంతా వర్మ పై గుర్రుగా ఉన్నారు.గత శుక్రవారం విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటేనే అతి కిరాతకంగా కనిపిస్తోంది. బూతు పదాలు సెక్స్ కంటెంట్‌తో నింపేసి వర్మ మార్క్ అంటే ఇదే అని నిరూపించుకున్నాడు. సినిమాల్లో సెన్సార్ బోర్డ్ అడ్డుతగలడంతో తన క్రియేటివిటీని మొత్తం యూట్యూబ్‌ ద్వారా బయటపెట్టేశాడు వర్మ. ఫ్యాక్షన్ అమ్మ వెలిసింది సీమలో.. ఆ అమ్మ గుడి రాయసీమ అయితే.. గర్భగుడి కడప.. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర అంటూ వర్మ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్‌లో చెప్పాడు.

ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ బాగా ఉండేది.కానీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్మ వచ్చి పడుకున్న సింహాలను లేపే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కడప అంటేనే హింస అన్నట్టు ఈ ట్రైలర్‌లో హింసాత్మక సన్నివేశాలను చూపించారని వెంటనే వర్మను అరెస్ట్ చేయాలంటూ ఆదివారం అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీద ఫిర్యాదు కూడా చేసారు.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ మీద వర్మకి హెచ్చరికలు కూడా జరీ అయ్యాయి. ఈ సిరీస్ కనుక వస్తే
వర్మకి గట్టి గుణపాఠం చెప్తామని రాయలసీమ ఐక్య వేదిక కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. ఒక వేళ అందరూ అభ్యంతరం చెప్తున్నట్టు కనుక ఈ వెబ్ సేయస్ ఉంటే … ఇప్పటికే అందిన ఫిర్యాదు మేరకు వర్మ అరెస్టు తప్పదా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

https://www.youtube.com/watch?v=6UJjBrBiGbA

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news