Gossipsఎన్టీఆర్ హాలిడే టూర్ ఎక్కడికో తెలుసా ?

ఎన్టీఆర్ హాలిడే టూర్ ఎక్కడికో తెలుసా ?

గత కొన్ని నెలలుగా టైట్ స్కెడ్యూల్  తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాల బిజీ గ వున్నారు . జై లవ కుశ చిత్రానికి గాను  మూడు పాత్రలు పోషించినా ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేంతగా రౌండ్ ది క్లోక్ పని చేసారు ఎన్టీఆర్ . దీనికి తోడు బిగ్ బాస్ షో హోస్ట్ చేసారు అంటే ఎన్టీఆర్ ఎంతెలా రెస్ట్ లెస్ గ పని చేసారో అర్ధం అవుతింది .

జై లవ కుశ సూపర్ సక్సెస్ తో సినీ అభిమానులనే  గాక , బిగ్ బాస్ షో తో బుల్లి తేరా ప్రేక్షకులను కూడా అలరించారు ఎన్టీఆర్. గత వారం తో బిగ్ బాస్ షో కూడా పూర్తి అయ్యింది . ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కి కొద్దీ రిలీఫ్ టైం దొరికిందని చెప్పాలి .

తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యనున్నారు . PK25 చిత్రం తో త్రివిక్రమ్ బిజీ గ ఉండటం వలన  తారక్ సినిమా  షూటింగ్ స్టార్ట్ కావడాన్ని మరో 3  నెలల సమయం పడుతుంది . పైగా బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గ పని చేసిన తారక్ కు  ఇప్పుడో హాలిడే తప్పనిసరి.

అయితే ఈ హాలిడే ను తారక్ కుటుంబం తో సహా వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. యూరప్ కి వెళ్తున్నట్టు తెలుస్తుంది . తన తదుపరి చిత్రం లో చెయ్యబోయే రోల్ కు ఒక న్యూ లుక్ ని అనుకుంటున్నట్టు తారక్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు . అయితే ఆ లుక్ కోసం కూడా ఈ హాలిడే లో బరువు తగ్గే ప్రయత్నం చెయ్యనున్నారు ఎన్టీఆర్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news