Gossipsఅఖిల్ హలో అక్కడ అదరగొట్టాడు..!

అఖిల్ హలో అక్కడ అదరగొట్టాడు..!

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా చేసిన మొదటి సినిమా అఖిల్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా సరే సెకండ్ మూవీ అంతకు రెట్టింపు క్రేజ్ తో వస్తుంది. విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా హలో అని పెట్టారు. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ రేటుకి అమ్ముడయ్యిందని తెలుస్తుంది. అఖిల్ మొదటి సినిమా కూడా ఓవర్సీస్ లో భారీగానే కొన్నా అక్కడ నష్టాల పాలయ్యింది. అయినా సరే మళ్లీ సెకండ్ మూవీకి అఖిల్ సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయకుండా భారీ బిజినెస్ చేస్తుంది. నాగార్జున స్వీయ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా దాదాపు 40 కోట్ల పైన బడ్జెట్ తో వస్తుందట.

సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం అఖిల్ సెకండ్ మూవీతోనే సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇక సినిమా నుండి రిలీజ్ అయిన అఖిల్ రెండు స్టిల్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news