Gossipsసైకిల్ పవర్ చూపిస్తా అంటోన్న పవర్ స్టార్

సైకిల్ పవర్ చూపిస్తా అంటోన్న పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ సైకిల్ ఎక్కాడు.. సైకిల్ అంటే తెలుగుదేశం సైకిల్ కాదండి సినిమాలో సైకిల్ ఎక్కాడు. మీరు ఆలా పొరపడడం లో కూడా అర్ధం ఉంది ఎందుకంటే… ఈ మధ్య రాజకీయాల్లో కూడా పవన్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు కదా !. అయినా పవన్ ఏది చేసిన డిఫ్రెంట్ గా స్టైలిష్ గా ఉంటుంది. అందుకే ఆయన అంటే యూత్ అంతా అంతలా అభిమానిస్తారు. సినిమా సినిమాకి డిఫ్రెంట్ మేనరిజంతో పవన్ వెండి తెర మీద నటన ఇరగదీసేస్తుంటాడు. ఒక్కో సినిమాలో ఒక్కో స్టయిల్ మెంటైన్ చెయ్యడంలో పవన్ ని మించిన వారు మరొకరు ఉండరు. బాక్సఆపీసు వద్ద కూడా పవన్ సినిమాలు కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాలపంట పండిస్తాడు మన పవర్ స్టార్.

తాజాగా అజ్ఞాతవాసి అంటూ మన ముందుకు వస్తున్న పవన్ ఆ సినిమాలో సైకిల్ ఎక్కి ఆయన ఇస్తున్న స్టిల్ అదరగొట్టేస్తోంది. ఈ స్టిల్ మీద ఎన్నో వార్తలు రకరకాలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. దీనికి కారణం ఆయన ఈ మధ్య రాజకీయాల్లో స్పీడ్ అవ్వడమే. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే.. నోటితో బెల్ట్ పట్టుకుని సైకిల్ తొక్కుతున్న పవన్ పోజు సరికొత్తగా ఉంది.

అజ్ఞాతవాసి వాల్ పోస్టర్ సోషల్ మీడియాలో కూడా బాగా హల్ చల్ చేస్తోంది. విడుదలైన కొద్ది సేపటికే పవన్ అభిమానుల నుండి వేల సంఖ్యలో లైక్స్ సంపాధించుకుంటే అదేవిధంగా ఈ స్టిల్ పై భారీ స్థాయిలో సెటైర్లు కూడ పొందుతోంది. గతవారం పవన్ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ తెలుగుదేశ ప్రభుత్వాన్ని అధినాయకుడు చంద్రబాబుని విమర్శించిన సంఘటనలు జరిగి కొద్దిరోజులు అవ్వకుండానే పవన్ అప్పుడే మళ్ళీ సైకిల్ ఎక్కేసాడా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సినిమాలో ఒక భాగం మాత్రమే అని రాజకీయాలకు దీనికి ఏ సంభంధం లేదని చిత్ర యూనిట్ చెప్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news